ఆధార్‌ ఉంటే.. 10 నిమిషాల్లో పాన్‌

ABN , First Publish Date - 2020-02-23T06:32:03+05:30 IST

కొత్తగా పాన్‌ (శాశ్వత ఖాతా నంబరు) కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించి, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌.

ఆధార్‌ ఉంటే.. 10 నిమిషాల్లో పాన్‌

కొత్తగా పాన్‌ (శాశ్వత ఖాతా నంబరు) కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించి, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌. ఆదాయం పన్ను (ఐటీ) డిపార్ట్‌మెంట్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్‌ కార్డు జారీ చేసే సదుపాయాన్ని  ప్రారంభించింది. అయితే, ఇది ఆధార్‌ కార్డు ఉన్నవారికే సుమా. ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా ఆన్‌లైన్‌లో నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ చేస్తారు. అదీ ఉచితంగా. 


  • ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ www.incometaxindiaefiling.gov.inలోకి లాగిన్‌కండి. పోర్టల్‌ మెయిన్‌ పేజీలోని ఎడమ భాగంలో కన్పించే క్విక్‌ లింక్స్‌ విభాగంలోని ‘ఇన్‌స్టంట్‌ పాన్‌ రఽథూ ఆధార్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. 

  • తద్వారా స్ర్కీన్‌పైన ప్రత్యక్షమయ్యే కొత్త పేజీలోని కింది భాగంలో కన్పించే ‘గెట్‌ న్యూ పాన్‌’ బటన్‌ను క్లిక్‌ చేయండి.  

  • కొత్త పాన్‌ కార్డు జారీ కోసం మీ ఆధార్‌ నంబరుతోపాటు స్ర్కీన్‌పై కన్పించే కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేశాక ‘జనరేట్‌ ఆధార్‌ ఓటీపీ’ అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. 

  • దాంతో మీ ఆధార్‌ కార్డుతో అనుసంధానితమైన మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి పోర్టల్‌లో రూఢిపర్చాలి. 

  • ఆ తర్వాత మీ ఆధార్‌ వివరాలనూ ధ్రువీకరించాలి. 


ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

  • ఈ-మెయిల్‌కు పాన్‌ కార్డు పొందగోరేవారు ఆ వివరాలను సైతం అందించాలి. 

  • ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా మీరు అందించిన డేటాను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వద్దనున్న సమాచారంతో సరిపోల్చి చూస్తారు. ఆ వెంటనే ఈ-పాన్‌ను జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తానికి మహా అయితే 10 నిమిషాల సమయం పట్టవచ్చు. 

  • ఆ తర్వాత మీరు మీ పాన్‌ను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘చెక్‌ స్టేటస్‌ లేదా డౌన్‌లోడ్‌ పాన్‌’ అప్షన్‌ను క్లిక్‌ చేసి ఆధార్‌ నంబరును ఎంటర్‌ చేస్తే సరిపోతుంది. 

  • ఒకవేళ మీ ఆధార్‌తో ఈ-మెయిల్‌ కూడా అనుసంధానమై ఉంటే,  పాన్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ మెయిల్‌ రూపంలో మీ ఇన్‌బాక్స్‌కు చేరుతుంది.


సౌలభ్యాలు

  • పాన్‌ జారీ పూర్తి ఉచితం
  • దరఖాస్తు చాలా సులభం
  • నిమిషాల్లో ముగిసే ప్రక్రియ 

ఎవరు అర్హులు..? 

  • ఇదివరకెన్నడూ పాన్‌ కార్డు  తీసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చు (మైనర్లు మినహా)

  • ఆధార్‌తో మొబైల్‌ నంబరు  అనుసంధానితమై ఉండాలి

  • ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ పూర్తి వివరాలు ‘తేదీ-నెల-సంవత్సరం’ ఫార్మాట్‌లో ఉండాలి

Updated Date - 2020-02-23T06:32:03+05:30 IST