కొవాగ్జిన్‌ ఉత్పత్తికి పనేసియా ఆసక్తి!

ABN , First Publish Date - 2021-04-09T05:52:46+05:30 IST

పనేసియా బయోటెక్‌.. కొవాగ్జిన్‌ టీకాను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కంపెనీకి ఉన్న యూనిట్‌లో కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయడానికి భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని

కొవాగ్జిన్‌ ఉత్పత్తికి పనేసియా ఆసక్తి!

భారత్‌ బయోటెక్‌తో చర్చలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పనేసియా బయోటెక్‌.. కొవాగ్జిన్‌ టీకాను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కంపెనీకి ఉన్న యూనిట్‌లో కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయడానికి  భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోందని, చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి నిధులు అందించమని ప్రభుత్వాన్ని రెండు కంపెనీలు కోరుతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు లభిస్తే.. రెండు మూడు నెలల్లో  కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయడానికి పనేసియా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్‌ టీకాను తయారు చేయడానికి అవసరమైన బయోసేఫ్టీ లెవల్‌ 3 తయారీ యూనిట్‌ పనేసియాకు ఉంది.  

Updated Date - 2021-04-09T05:52:46+05:30 IST