పానసోనిక్‌ కొత్త శ్రేణి ‘కనెక్టెడ్‌ ఏసీ’లు

ABN , First Publish Date - 2020-02-21T06:35:40+05:30 IST

పానసోనిక్‌ ఇండి యా దేశీయ మార్కెట్లోకి కొత్త శ్రేణి కనెక్టెడ్‌ ఎయిర్‌ కండీషనర్లను ప్రవేశపెట్టింది. కొత్త తరం వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని

పానసోనిక్‌ కొత్త శ్రేణి ‘కనెక్టెడ్‌ ఏసీ’లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పానసోనిక్‌ ఇండి యా దేశీయ మార్కెట్లోకి కొత్త శ్రేణి కనెక్టెడ్‌ ఎయిర్‌ కండీషనర్లను ప్రవేశపెట్టింది. కొత్త తరం వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ‘కస్టమైజ్డ్‌ స్లీప్‌ మోడ్‌’ కలిగిన కొత్త ఏసీలను విడుదల చేశామని పానసోనిక్‌ ఇండియా (ఎయిర్‌ కండీషనింగ్‌ గ్రూప్‌) వ్యాపార అధిపతి గౌరవ్‌ షా తెలిపారు. బయటి వాతావరణానికి అనుగుణంగా ఏసీ ఉష్ణోగ్రతను ముందుగా ప్రోగ్రామ్‌ చేసుకునేందుకు ఈ ఏసీలు వీలు కల్పిస్తాయని తెలిపారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఉండే  కొత్త స్ల్పిట్‌ ఏసీల ధర రూ.35,990 నుంచి ప్రారంభమవుతాయని, ఏఐతో పని చేసే ‘మిరాయ్‌’ యాప్‌ మరింత సౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు.

Updated Date - 2020-02-21T06:35:40+05:30 IST