Advertisement
Advertisement
Abn logo
Advertisement

శివ నామస్మరణతో హోరెత్తిన పంచదార్ల

ఆకాశ ధార వద్ద భక్తిశ్రద్ధలతో కార్తీక స్నానాలు

శివయ్య దర్శనానికి బారులు తీరిన భక్తులు

రాంబిల్లి/మునగపాక/ఎలమంచిలి/అచ్యుతాపురం రూరల్‌, నవంబరు 29: కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా రాంబిల్లి మండలం పంచదార్ల పురాతన ఆలయం కిక్కిరిసిపోయింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఇందులో కొందరు తొలుత రాధామాధవస్వామి ఆలయ గర్భంలో ప్రవహిస్తున్న ఆకాశధార వద్ద స్నానాలను ఆచరించి, ఫణిగిరిపై వేంచేసి ఉన్న ఉమాధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాంబిల్లి ఎస్‌ఐ పి.రాజారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు  నిర్వహించారు. అలాగే, ఎలమంచిలి పట్టణంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.  కొత్తపేట రామలింగేశ్వరస్వామి ఆలయం, శేషుగెడ్డ శివాలయం, త్రిమూర్తులు స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. సోమలింగపాలెం, కొత్తపాలెం, పెదపల్లి, ఏటికొప్పాక, పీఎన్‌ఆర్‌ పేట, పులపర్తి తదితర పలు గ్రామాల్లోని ఆలయాల్లో విశేష అభిషేకాలు జరిపారు.  మునగపాక మండలంలోని ఆలయాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. నాగులాపల్లి చంద్రశేఖర్‌ మహాస్వామి పిరమిడ్‌ ధ్యాన కేంద్రంలో వనమహోత్సవాన్ని నిర్వహించారు.   ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు సుజాత ఉసిరి, మారేడు చెట్ల ప్రాధాన్యాన్ని వివరించారు. అదేవిధంగా, అచ్యుతాపురం మండలంలోని ఆలయాలు సందడిగా మారాయి. అచ్యుతాపురంతో పాటు హరిపాలెం, తిమ్మరాజుపేట, ఎం.జగన్నాథపురం తదితర గ్రామాల్లో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 

Advertisement
Advertisement