Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

వంగూరు నవంబరు 30 : నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం రంగాపూర్‌ పంచా యతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్‌ గ్రామానికి చెందిన సంకిళ్ల రాము తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేర మ్యుటేషన్‌ చేయాలని పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రామస్వామికి లంచం ఇవ్వాని డిమాండ్‌ చేయగా రాము ఏసీబీ అధికా రులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం.. పంచాయతీ కార్యదర్శి రామస్వామికి  కార్యాలయంలో రాము రూ.5500 లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కార్యదర్శిపై కేసు నమోదు చేసిట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్‌ తెలిపారు. 


Advertisement
Advertisement