బాలికల ట్రాప్ కేసులో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

ABN , First Publish Date - 2021-08-13T03:34:25+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జడ్చర్ల మైనర్ బాలికల ట్రాప్ కేసులో జూనియర్

బాలికల ట్రాప్ కేసులో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జడ్చర్ల మైనర్ బాలికల ట్రాప్ కేసులో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సంపంగి మహేష్‌‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకట్ రావు ఆదేశాలు జారీ చేశారు. బాలికల ట్రాప్ కేసులో సంపంగి మహేష్ రెండో నిందితుడిగా ఉన్నాడు. జడ్చర్ల (మ) పోచమ్మగడ్డ తండాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా మహేష్ పని చేస్తున్నాడు. కేసు నుంచి మహేష్‌ను తప్పించేందుకు జడ్చర్ల పోలీసుల యత్నాలు పెట్టారు. దీంతో కేసు విషయంపై దృష్టిసారించి కార్యదర్శి మహేష్‌పై జిల్లా కలెక్టర్ వెంకట్ రావు వేటు వేసారు. ట్రాప్‌ కేసును ప్రైవేట్‌ టీచర్‌ మహేష్‌పై నెట్టేందుకు పోలీసుల యత్నాలు చేసారు. టీచర్‌ మహేష్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని జడ్చర్ల సీఐ వీరాస్వామి తెలిపారు. పోలీసుల తీరుపై బాధితులు మండిపడుతున్నారు. 


ఈ కేసులో ఒకే ఒక్క వ్యక్తి ప్రైవేట్ టీచర్ డి. మహేశ్  ప్రమేయం ఉందంటూ సాయంత్రం సీఐ వీరాస్వామి ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. సంపంగి మహేశ్ ప్రమేయం లేదని జడ్చర్ల పోలీసులు నమ్మించే ప్రయత్నం చేసారు. ఇంతలోపే సంపంగి మహేశ్‌ను తక్షణమే విధుల్లో నుంచి తొలగిస్తున్నామని  జిల్లా కలెక్టర్ వెంకట్ రావు ఆదేశాలు జారీ చేసారు. తప్పని పరిస్థితుల్లో సంపంగి మహేశ్‌పై కేసు చేయాల్సిన పరిస్థితి జడ్చర్ల పోలీసులకు  ఏర్పడింది. జడ్చర్ల పోలీసుల తీరుపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి.  

Updated Date - 2021-08-13T03:34:25+05:30 IST