పంచాయతీల్లో లెక్క పక్కా..

ABN , First Publish Date - 2020-09-30T06:43:16+05:30 IST

పట్టణాలు, గ్రామాల్లోని ప్రజల ఆస్తుల లెక్కలను పక్కాగా నిర్వహిం చేందుకు సర్కార్‌ నడుం బిగించింది. గతంలో వ్యవ సాయ,

పంచాయతీల్లో లెక్క పక్కా..

గృహాల మదింపు, పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారుల నియామకం..


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : పట్టణాలు, గ్రామాల్లోని ప్రజల ఆస్తుల లెక్కలను పక్కాగా నిర్వహిం చేందుకు సర్కార్‌ నడుం బిగించింది. గతంలో వ్యవ సాయ, వ్యవసాయేతర భూరికార్డులను ప్రక్షాళన చేసిన ప్రభుత్వం తాజాగా గ్రామాలు, పట్టణాల్లో రికార్డుల్లో నమోదుకాని ప్రజల ఇళ్లు, స్థలాలు, ప్లాట్లు, వ్యవసాయే తర ఆస్తుల వివరాల సేకరణకు అడుగులు వేస్తోంది. నూతన రెవెన్యూ చట్టాన్ని అమలుచేసే క్రమంలో ముం దస్తు చర్యల కింద ఆస్తుల వివరాలను ధరణి వెబ్‌ పోర్ట ల్‌లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాలోని 21మండలాల్లోని గ్రామపంచాయతీల్లోని గృహాల మదింపు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా అదనపుకలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలకు నియ మించారు.


అలాగే జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డిని నంది గామ, కొత్తూరుకు నియమించగా డిప్యూటీ సీఈవో కె.జానకిరెడ్డిని ఫరూక్‌నగర్‌ మండలానికి నియమిం చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం మండలాలకు జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీనివాస్‌రెడ్డిని నియమిం చారు. శంషాబాద్‌ మండలానికి రాజేంద్రనగర్‌ డివిజనల్‌ పంచాయతీ అధికారి సీహెచ్‌ తరుణ్‌కుమార్‌, చైదరిగూడ, కొందుర్గు, కేశంపేట మండలాలకు షాద్‌నగర్‌ డివిజనల్‌ పంచాయతీ అధికారి ఆర్‌. సునందను నియమించారు. మాడ్గుల, మంచాల, యాచారం మండలాలకు ఇబ్రహీం పట్నం డివిజన్‌ పంచా యతీ అధికారరి వి.సంధ్యారాణిని నియమించారు. చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌, శంకర్‌ పల్లి మండలాలకు చేవెళ్ల డివిజనల్‌ పంచాయతీ అధికారి బి.శ్రీకాంత్‌రెడ్డిని నియమించారు. కడ్తాల్‌, కందుకూరు, మహేశ్వరం మండలాలకు కందుకూరు డివిజన్‌ పంచా యతీ అధికారి ఎ.శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-09-30T06:43:16+05:30 IST