Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంచాయతీ నిధుల మళ్లింపు అన్యాయం

గన్నవరం, నవంబరు 27: గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వా ల్సింది పోయి  పంచాయతీల్లో జమ అయిన ఆర్థికసంఘం నిధులను ప్రభుత్వం దొడ్డిదారిన మళ్లించడం అన్యాయ మని గన్నవరం మండలం సూరంపల్లి ఉప సర్పంచ్‌ ఈలప్రోలు శ్రీనివాసు అన్నారు. సూరంపల్లి  పంచాయతీ పాలకవర్గ సమావేశం శనివారం జరిగింది. అనంతరం టీడీపీ వార్డు సభ్యులు 8మంది పంచాయతీ ఖాతాలోని 15వ ఆర్ధిక సంఘం నిధులను ప్రభుత్వం  మళ్లించు కోవటంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా  శ్రీనివాసు మాట్లాడుతూ జనాభా ప్రాతి పాదికన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వదలటం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మచ్చుకు కూడా కనిపించటం లేదన్నారు. పంచాయతీలో పని చేసే కార్మికులకు జీతాలు ఇచ్చేందుకే కష్టంగా ఉంటే ఉన్న నిధు లను ప్రభుత్వం తీసుకోవటం దుర్మార్గమన్నారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించటంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిధులు వెంటనే పంచా యతీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. వార్డు సభ్యులు రామెళ్ళ సత్యనా రాయణ, పెద్దపూడి సుధాకర్‌, గుగులోతు కళావతి, నున్న శివలీల, గుడ్డేటి రజని, పులపాక సునీత, మందా వజ్రం పాల్గొన్నారు. 

Advertisement
Advertisement