పాంక్రియాస్‌ సమస్యలు - అవగాహన

ABN , First Publish Date - 2021-01-26T06:32:55+05:30 IST

జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన గ్రంధి పాంక్రియాస్‌లో ఒక భాగం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తే, రెండో భాగం హార్మోన్లను ఉత్పత్తి చేసి గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తుంది. ఈ గ్రంధి జబ్బుపడే సందర్భాలు ఉంటాయి.

పాంక్రియాస్‌ సమస్యలు - అవగాహన

జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన గ్రంధి పాంక్రియాస్‌లో ఒక భాగం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తే, రెండో భాగం హార్మోన్లను ఉత్పత్తి చేసి గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తుంది. ఈ గ్రంధి జబ్బుపడే సందర్భాలు ఉంటాయి.


అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌

పాంక్రియాస్‌ గ్రంధిలో వాపు ఇది. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు, అతిగా మద్యపానం, అధిక కొలెస్ట్రాల్‌, కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. కడుపులో తీవ్రమైన నొప్పి, నొప్పి వెన్నులోకి పాకడం లక్షణాలుగా ఉంటాయి. వాంతులు, జ్వరం, కడుపు ఉబ్బరం, శ్వాసలో ఇబ్బంది, మూత్రం తగ్గిపోవడం, కామెర్లు కూడా జరగవచ్చు. రక్త పరీక్షలు, సీరం అమైలైజ్‌, అలా్ట్రసౌండ్‌, ఈఆర్‌సీపీ కూడా చేయవలసిరావచ్చు. ఎక్కువ సందర్భాల్లో సమస్య మందులతో అదుపులోకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్‌ తప్పదు. లాప్రోస్కోపిక్‌ లేదా ఎండోస్కోపీ విధానాల ద్వారా సర్జరీ చేయవచ్చు.


పాంక్రియాస్‌లో రాళ్లు

కడుపు పైభాగంలో నొప్పి, నొప్పి వెన్నులోకి పాకడం లాంటి లక్షణాలు ఉంటాయి. సమస్య ముదిరేకొద్దీ తరచూ నొప్పితో దైనందిన జీవితం ఇబ్బందిగా మారుతుంది. పాంక్రియాస్‌ కుంచించుకుపోవడం మూలంగా విరోచనంలో నూనె జిగురు పడుతుంది. కామెర్లు, బరువు తగ్గడం కూడా జరుగుతుంది. జన్యుపరమైన లోపాలు, ఆహార లోపాల మూలంగా పాంక్రియాస్‌ (ట్రాపికల్‌ పాంక్రియాటైటిస్‌)లో రాళ్లు ఏర్పడే సమస్య చిన్న వయసులోనే బయల్పడుతుంది. అలా్ట్రసౌండ్‌, ఎమ్‌ఆర్‌సీపీ, ఈఆర్‌సీపీ పరీక్షలు కూడా అవసరం పడవచ్చు. రాళ్లను లిథో ట్రిప్సీ, ఎండోస్కోపీ విధానాల ద్వారా తొలగించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగితే ఎల్‌పీజీ ఆపరేషన్‌తో సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.


పాంక్రియాస్‌లో కేన్సర్‌

పాంక్రియాస్‌ డక్ట్‌లో కేన్సర్‌ తలెత్తుతుంది. కడుపునొప్పి, కామెర్లు, బరువు తగ్గడం, నల్ల విరోచనాలు ప్రధాన లక్షణాలు. పాంక్రియాస్‌ గ్రంధి చివరి భాగంలో కేన్సర్‌ తలెత్తితే లక్షణాలు కనిపించకుండానే వ్యాధి ముదిరిపోవచ్చు. పొత్తికడుపు అలా్ట్రసౌండ్‌, సిటి స్కాన్‌ పరీక్షల ద్వారా కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో బయాప్సీ అవసరం పడవచ్చు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం కీలకం. కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలతో చికిత్స చేస్తే ఫలితం కనిపిస్తుంది. మద్యం పూర్తిగా మానేస్తే చికిత్స ఫలవంతమయ్యే అవకాశాలు ఎక్కువ.


నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌లో అంతర్జాతీయ వైద్య సంస్థల్లో శిక్షణ పొందిన డాక్టర్‌ ఆర్‌.వి.రాఘవేంద్రరావు నేతృత్వంలోని వైద్యుల బృందం పాంక్రియాస్‌ సమస్యలకు అవసరమైన మెడికల్‌, సర్జికల్‌ విధానాల్లో చికిత్స అందిస్తుంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, అధునాతన పరికరాలు, సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి.


డాక్టర్‌ ఆర్‌.వి. రాఘవేంద్రరావు M.S, M Ch, F.H.P.B, F.L.T,

సర్జికల్‌ గ్యాస్ర్టోఎంటరాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌,

డైరెక్టర్‌, రెనోవా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ 

అండ్‌ లివర్‌ డిసీజెస్‌,

న్యూ ఎమ్‌.ఎల్‌.ఎ కాలనీ, రోడ్‌ నం 12,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 7993089995

email: drrvrrao@gmail.com 

Updated Date - 2021-01-26T06:32:55+05:30 IST