లెజెండరీ కథక్ డాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత

ABN , First Publish Date - 2022-01-17T12:58:46+05:30 IST

లెజెండరీ కథక్ డాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు....

లెజెండరీ కథక్ డాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత

న్యూఢిల్లీ : లెజెండరీ కథక్ డాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ప్రముఖ కథక్ డాన్సర్ అయిన పండిట్ బిర్జు మహారాజ్ ఢిల్లీలోని తన స్వగృహంలో కన్నుమూశారని అతని శిష్యులు చెప్పారు.భారతదేశ ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరైన బిర్జు మహారాజ్ కు అతని శిష్యులు పండిట్ జీ, మహారాజ్ జీ అని ముద్దుగా పిలిచే వారు. బిర్జు మహారాజ్ వయసు 83 సంవత్సరాలు. పండిట్ బిర్జు మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. బిర్జు మహారాజ్ గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో బిర్జు మహారాజ్ ను ఆసుపత్రికి తరలించామని, అప్పటికే మరణించాడని అతని మనవరాలు రాగిణి మహారాజ్ చెప్పారు. బిర్జు మహారాజ్ కు పద్మవిభూషణ్ అవార్డు లభించింది.



Updated Date - 2022-01-17T12:58:46+05:30 IST