Abn logo
Sep 25 2021 @ 22:38PM

ఘనంగా పండిట్‌ దీన్‌దయాళ్‌ జయంతి

నస్పూర్‌లో దీన్‌దయాళ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌

నస్పూర్‌, సెప్టెంబరు 25: ఆర్‌కే-6 కాలనీలో శని వారం బీజేపీ ఆధ్వర్యంలో పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపా ధ్యాయ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి మొక్కలను నాటారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌, నాయకులు  రమేష్‌, సదానందం, వెంకటేశ్‌, రాజు, రమేష్‌ పాల్గొన్నారు. 

లక్షెట్టిపేట: గాంధీ చౌరస్తా వద్ద పండిట్‌ దీన్‌ద యాళ్‌ ఉపాధ్యాయ జయంతిని బీజేపీ నాయకులు నిర్వ హించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  హరిగోపాల్‌, సతీష్‌, మధు, రమేష్‌, చంద్రయ్య పాల్గొన్నారు. కొమ్ముగూడెం ప్రాథమిక పాఠ శాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌  పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు అందజేసి ఉపాధ్యాయులను సన్మానించారు. పాఠశాల ఆవర ణలో మొక్కలు నాటారు.  గోపికిషన్‌, సతీష్‌, హేమంత్‌రెడ్డి, సతీష్‌రావుపాల్గొన్నారు. 

ఏసీసీ: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు దక్కిందని బిజెపి మంచిర్యాల అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని బీజేపీ కార్యాలయంలో నివాళులర్పిం చారు.   రఘునాథ్‌ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ప్రతిపాదించిన మహనీయుడని కొనియాడారు.  వెంకటేశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్‌, శ్రీదేవి పాల్గొన్నారు.