పనీర్‌ అఫ్ఘానీ

ABN , First Publish Date - 2020-12-26T20:48:30+05:30 IST

పనీర్‌ - 500 గ్రాములు, పుచ్చకాయ గింజలు - ఒక టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు - ఒక కప్పు, గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్‌(గంటపాటు నానబెట్టుకోవాలి), క్రీమ్‌ - ఒక

పనీర్‌ అఫ్ఘానీ

కావలసినవి: పనీర్‌ - 500 గ్రాములు, పుచ్చకాయ గింజలు - ఒక టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు - ఒక కప్పు, గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్‌(గంటపాటు నానబెట్టుకోవాలి), క్రీమ్‌ - ఒక కప్పు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలు - రెండు టీస్పూన్లు, యాలకులు - ఐదారు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: పనీర్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పుచ్చకాయ గింజలు, జీడిపప్పు, గసగసాలు, మిరియాలు, యాలకులను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఒక పాత్రలో పనీర్‌ ముక్కలు తీసుకుని అందులో ఆ పొడి వేయాలి. తరువాత క్రీమ్‌, వెన్న, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత వీటిని ఎలక్ర్టిక్‌ గ్రిల్‌పై లేదా తందూరీ స్టయిల్‌లో కాల్చి వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-12-26T20:48:30+05:30 IST