Advertisement
Advertisement
Abn logo
Advertisement

పనీర్‌ కోఫ్తే కా సలాన్‌

కావలసినవి: పనీర్‌ - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో ప్యూరీ - 200ఎంఎల్‌, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, నూనె - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - కొద్దిగా.


తయారీ విధానం: కోఫ్తాలు తయారుచేసుకోవడం కోసం పనీర్‌ను గుజ్జుగా చేసి కార్న్‌ఫ్లోర్‌ను వేసి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసి నిమ్మకాయ సైజులో బాల్స్‌లా చేసుకుని నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. కొద్దిగా నీళ్లు పోసి కారం, పసుపు, ఉప్పు వేయాలి. కాసేపయ్యాక టొమాటో ప్యూరీ వేసి ఒక కప్పు నీళ్లు పోయాలి. గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు జీలకర్ర పొడి వేసి కోఫ్తాలు వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని చపాతీతో లేదా అన్నంతో సర్వ్‌ చేసుకోవాలి.


ఆవాల ఆకుల కర్రీ కాజూ మసాలా ఆలూ మేతీసాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీకరివేపాకు చట్నీకరివేపాకు కర్రీచోలే రాజ్మా కర్రీసోయా బీన్‌ ఆలూ కూర్మాకీటో బటర్‌ పనీర్‌
Advertisement