బటన్ నొక్కితే చాలు...జైలులోని ఖైదీలకు తక్షణ వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-07-02T14:44:16+05:30 IST

జిల్లా జైలులో ఖైదీలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఆగ్రా జిల్లా జైలు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు....

బటన్ నొక్కితే చాలు...జైలులోని ఖైదీలకు తక్షణ వైద్యసేవలు

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): జిల్లా జైలులో ఖైదీలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఆగ్రా జిల్లా జైలు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జైలులో ఉన్న ఖైదీలు అనారోగ్యానికి గురైతే, వారు వైర్‌లెస్ పానిక్ బటన్ నొక్కితే చాలు జైలు సమీపంలోనే సిద్ధంగా ఉన్న వైద్యులు సత్వరం వచ్చి వైద్యసేవలు అందిస్తారు. దీనిలో భాగంగా ఆగ్రా జిల్లా జైలు అధికారులు వైర్‌లెస్ అలారం సిస్టమ్ ను ప్రారంభించారు. రాత్రివేళల్లో అత్యవసరంగా వైద్యసహాయం అవసరమైతే ఖైదీలు బారక్ లో ఉన్న పానిక్ బటన్ నొక్కితే చాలని సత్వరం వైద్యులు వచ్చి చికిత్స చేస్తారని జైళ్ల శాఖ డీఐజీ లవ్ కుమార్ చెప్పారు. జైలులోని ప్రతీ బారక్ లో ఓ స్విచ్ ఖైదీలకు అందుబాటులో ఉంచామని లవ్ కుమార్ చెప్పారు. అలారం మోగగానే మెయిన్ గేటు వద్ద డ్యూటీలో ఉన్న గార్డు బారక్ డ్యూటీగార్డును అప్రమత్తం చేస్తారు. ఆ వెంటనే వైద్యులు వచ్చి అనారోగ్యానికి గురైన ఖైదీకి వైద్యసేవలు అందిస్తారు. యూపీలోనే ప్రథమంగా ప్రయోగాత్మకంగా జైలులో పానిక్ బటన్ విధానం ప్రవేశపెట్టామని యూపీ జైలు అధికారులు చెప్పారు.

Updated Date - 2020-07-02T14:44:16+05:30 IST