బొప్పాయి గింజలతో జీర్ణం సులభం...

ABN , First Publish Date - 2020-06-06T18:00:44+05:30 IST

వేసవిలో విరివిగా దొరికే బొప్పాయిలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలు బోలెడు. అయితే చాలమంది బొప్పాయి గుజ్జును మాత్రమే తింటారు. కానీ పోషకాలతో నిండిన ఈ గింజలు నేరుగా కాకుండా పొడిచేసుకొని స్మూతీ, జ్యూస్‌లలో తక్కువ మోతాదులో కలిపి తాగితే మంచిది. తీయదనం కోసం బెల్లం లేదా తేనెతో తినాలి.

బొప్పాయి గింజలతో జీర్ణం సులభం...

ఆంధ్రజ్యోతి(06-06-2020)

వేసవిలో విరివిగా దొరికే బొప్పాయిలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలు బోలెడు. అయితే చాలమంది బొప్పాయి గుజ్జును మాత్రమే తింటారు. కానీ పోషకాలతో నిండిన ఈ గింజలు నేరుగా కాకుండా పొడిచేసుకొని స్మూతీ, జ్యూస్‌లలో తక్కువ మోతాదులో కలిపి తాగితే మంచిది. తీయదనం కోసం బెల్లం లేదా తేనెతో తినాలి. 

బొప్పాయి గింజలు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణసంబంధ సమస్యలకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియాను ఇవి బయటకు పంపేస్తాయి.

నెలసరి సమయంలో వేధించే పొత్తికడుపు నొప్పిని బొప్పాయి గింజలు తగ్గిస్తాయి. కండరాలు పట్టేసినప్పుడు ఈ గింజలు తింటే ఊరట లభిస్తుంది.

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న అనారోగ్యాల నుంచి రక్షణనిస్తాయి.

ఈ గింజల్లో పీచు ఎక్కువ. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడంలో దోహదపడుతుంది. 

Updated Date - 2020-06-06T18:00:44+05:30 IST