భలే పిల్లి!

ABN , First Publish Date - 2020-12-06T05:30:00+05:30 IST

పిల్లల కోసం పేపర్లతో పిల్లి

భలే పిల్లి!

కావలసినవి

ఆరెంజ్‌ కలర్‌ ఫోమ్‌ షీట్లు - రెండు, పసుపు రంగు ఫోమ్‌ షీట్‌ - ఒకటి, పింక్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌ - ఒకటి, కత్తెర, పెన్సిల్‌, జిగురు, బ్లాక్‌ స్కెచ్‌.


ఇలా చేయాలి

  1. ముందుగా ఆరెంజ్‌ కలర్‌ ఫోమ్‌ షీట్స్‌పై పెన్సిల్‌ సహాయంతో పిల్లి బొమ్మ అవుట్‌లైన్‌ గీయండి.
  2. తరువాత కత్తెర సహాయంతో కత్తిరించండి. 
  3. ఇప్పుడు పసుపు రంగు షీట్‌పై చెవులు, మీసాలు, జుట్టు అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి.
  4. కత్తిరించిన పసుపు రంగు షీట్‌ను ఆరెంజ్‌ కలర్‌ షీట్‌ పైభాగంలో అతికించండి. మరొక ఆరెంజ్‌ షీట్‌పై కాళ్లు గీసి, కత్తిరించి కింది భాగంలో అంటించండి. 
  5. పింక్‌ కలర్‌ షీట్‌పై ముక్కు కోసం ఒక వృత్తం, చెంపలపై అంటించడానికి మరో రెండు వృత్తాలు కత్తిరించి బొమ్మలో చూపిన విధంగా పసుపు రంగు షీట్‌పై అతికించండి.
  6. నలుపు రంగు స్కెచ్‌తో నోరు, కళ్లు గీయండి. కళ్ల మధ్యలో కొద్దిగా తెలుపు రంగు వేస్తే పిల్లి బొమ్మ పూర్తయినట్టే!

Updated Date - 2020-12-06T05:30:00+05:30 IST