పాపికొండల షికారు కోసం బేతీమెట్రిక్‌ సర్వే

ABN , First Publish Date - 2021-01-17T06:23:51+05:30 IST

వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి పాపికొండల బోట్‌ షికారు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

పాపికొండల షికారు కోసం బేతీమెట్రిక్‌ సర్వే

25 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి

వచ్చే నెలలో సర్వే ప్రారంభం

 రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి) : వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి పాపికొండల బోట్‌ షికారు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ యాత్రకు అనుకూల పరిస్థితులు కల్పించడం కోసం నిర్వహించే బేతీమెట్రిక్‌ సర్వేకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. సుమారు రూ.50 లక్షల అంచనాతో ఈ టెండరు పిలిచారు. ఈనెల 25 నాటికి టెండరు ప్రక్రియ పూర్తి అవుతుందని, ఫిబ్రవరిలో     సర్వే మొదలవుతుందని ఇరిగేషన్‌ అధికారుల అంచనా. రెండు నెలల్లో ఈ సర్వే పూర్తికానుంది. తర్వాత బోట్లకు అనుమతి ఇస్తారు. జూలై నుంచి బోట్‌ షికార్‌ ప్రారంభమవు తుంది.   పోలవరం నుంచి పోచవరం వరకూ 67 కిలోమీటర్ల మేర ఈ సర్వే చేయనున్నారు.డ్రెడ్జింగ్‌ లోనూ దందా! 


Updated Date - 2021-01-17T06:23:51+05:30 IST