పాపికొండలు వెళ్లాలనుకునే వాళ్లకు శుభవార్త

ABN , First Publish Date - 2021-10-26T06:55:05+05:30 IST

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 25: పాపికొండలు బోటు షికారు కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈనెల 31 నుంచి బోటు షికారు ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే పోచవరం నుంచి 12 బోట్లకు, పోలవరం నుంచి 6 బోట్లకు అనుమతి ఇచ్చారు. మరికొన్ని బోట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకూ తమ బోట్లకు అ

పాపికొండలు వెళ్లాలనుకునే వాళ్లకు శుభవార్త

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 25: పాపికొండలు బోటు షికారు కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈనెల 31 నుంచి బోటు షికారు ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే పోచవరం నుంచి 12 బోట్లకు, పోలవరం నుంచి 6 బోట్లకు అనుమతి ఇచ్చారు. మరికొన్ని బోట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకూ తమ బోట్లకు అనుమతి తెచ్చుకోవడానికి తంటాలు పడిన ప్రైవేట్‌ బోటు నిర్వాహకులు ఇవాళ చార్జీలు పెంచమని కోరుతున్నారు. ఈవారంలో కొత్త రేట్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో పెద్దలకు రూ.750 వరకూ తీసుకునేవారు. రాజమహేంద్రవరం నుంచి తీసుకుని వెళ్లి బోటు ఎక్కించి భోజనం, స్నాక్స్‌ పెట్టి సాయంకాలం తీసుకొచ్చేవారు.   ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్‌ పూర్తికావడంతో ఇక బోటింగ్‌ గండిపోచమ్మ గుడి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌లు వరదలో మునిగిపోవడంతో వాటిని వేరే ప్రాంతాలకు తరలించారు. కొత్త రేట్లతో ఈ నెలాఖరు నుంచి బోటు షికారు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టూరిజం బోట్లతోపాటు, ప్రైవేట్‌ బోట్లు కూడా షికారు చేయనున్నాయి. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల బోటు యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ల తర్వాత ఈ బోటు షికారు ప్రారంభం కానుంది.  కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల పాపికొండలలో గతంలో కంటే గోదారి లోతు పెరిగింది.


ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని  ఈ బోటు యాత్ర ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ పాపికొండలలో సిగ్నల్స్‌ లేనందున అక్కడి సమాచారం అందే అవకాశాలు తక్కువే. గతంలో రూపొందించిన నిబంధనలు పాటిస్తూ బోటు షికారు మొదలుపెడితే మం చిది. లైసెన్స్‌ ఉన్న బోట్లకు అనుమతి ఇవ్వాలని, డ్రైవర్లకు శిక్షణ ఉండాలని, అంతా లైప్‌ జాకెట్లు ధరించాలని, రెండు ఇంజన్లు ఉం డాలని, గజఈతగాళ్లు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అంతేకాక యాత్రికులు బోటులోకి ఎక్కడానికి దిగడానికి గోదావరి ఒడ్డున సరైన ఏర్పాట్లు కూడా ఉండాలని కోరుతున్నారు. బోటు షికారు వల్ల మళ్లీ వీటి మీద ఆధారపడిన వారికి పని దొరుకుతుంది. లాంచీలను పూర్తిగా నిషేధించి బోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు.


ఆనందంగా ఉంది : బోట్ల యజమానులు

వరరామచంద్రాపురం, అక్ట్టోబరు 25 : రెండున్నర ఏళ్ల తర్వాత పాపికొండలు, పేరంటాలపల్లి విహారయాత్రకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందని, ఈనెలాఖరు నుంచి విహార యాత్ర ప్రారంభమవుతుందని బోట్‌ నిర్వాహకులు మాదిరెడ్డి, సత్యనారాయణ, సూర్యప్రకాశరావు, వాళ్ల రంగారెడ్డి తెలిపారు. రేఖపల్లిలోని ఎం సత్తిబాబు నివాసంలో పలివెల రామకృష్ణ అధ్యక్షతన బోటు నిర్వాకుల సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  బోట్లు నిలిచిపోవడంతో చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయన్నారు. ఏమైనా విహార యాత్రకు అనుమతులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. గిరిజన, గిరినేతరులకు సంబంధించిన 12 బోట్లకు మాత్రమే అనుమతులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీ రమణ, పండు, కొత్త రామ్మోహన్‌రావు, బచ్చు సూరిబాబు, కొమ్మాని మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T06:55:05+05:30 IST