Advertisement
Advertisement
Abn logo
Advertisement

30అడుగుల ఎత్తులో.. విద్యుత్ తీగల మధ్య ఓ వ్యక్తి!

కాలిఫోర్నియా: అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయపటడ్డాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. పారాషూట్‌ ద్వారా ఆకాశంలో ఎగురుతున్న ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు.  పారాషూట్ విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకోవడంతో దాదాపు 30అడుగుల ఎత్తులో అతను వేలడబడ్డాడు. దీంతో ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో రస్క్యూ టీం సహాయంతో పోలీసులు.. అతన్ని క్షేమంగా కిందికి దించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. అతనికి స్వల్పంగా గాయాలు అయినట్టు వెల్లడించారు. దగ్గర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ లైన్ల మధ్య చిక్కుకున్న పారాషూట్‌ను కూడా తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. 


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement