ఊరేగింపు

ABN , First Publish Date - 2020-05-25T09:49:25+05:30 IST

తలలు దండ గుచ్చి మొండేలను వేసవిలో బాగా వేయించి పాదసాదల వేడి నెత్తుటితో రోడ్లను ఎర్రతివాచీలు చేసి ఏలినవారిని కీర్తిస్తూ...

ఊరేగింపు

తలలు దండ గుచ్చి

మొండేలను వేసవిలో బాగా వేయించి

పాదసాదల వేడి నెత్తుటితో

రోడ్లను ఎర్రతివాచీలు చేసి

ఏలినవారిని కీర్తిస్తూ

సంబరాలు చేసుకుంటున్నది దేశం


అడుగంటిన పాలకుండలను

గుండెలపై ధరించి

చంకన పిల్ల అస్థిపంజరాలతో

ఎండమావుల్లాంటి 

దూరపు బావులకు తరలివెళ్లి

లోకతాళపు శోకాన్నంతా

మోసుకొస్తూ

రైలుఛార్జీకి భీతిల్లిన తల్లులను

బోగీలనతికించే రాడ్ల మీద కూచోబెట్టి

పుష్పక విహారం చేయిస్తున్న

పాలకుల ప్రజాసేవకు

పులకితానంద తాండవం

చేస్తున్నది భారతం


కాజేసేవారికి ప్యాకేజీలు

రెక్కల శ్రంపన్నులకు ఆకలిచావులు

ప్రసాదిస్తున్న

ఆత్మనిర్భర వ్యూహకర్తలను

హృదయ పల్లకీలపై

ఊరేగిస్తున్నారు జనం

బాధల కత్తిపోట్లకు

సెలలు వేసిన గాయాల

మాలలు బాటలు

నిజం

Updated Date - 2020-05-25T09:49:25+05:30 IST