Abn logo
Aug 4 2020 @ 19:45PM

మహేష్‌ ఫ్యాన్స్‌ని మోసం చేస్తున్న పరశురామ్ ఫేక్ అకౌంట్

ప్రతీ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. ఈసారి కూడా తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను ఆయన ప్రకటించారు. అలాగే ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో తన ఫ్యాన్స్‌ను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీ‌ఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు.. ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నాయి. ఇక రాబోయే సూపర్‌స్టార్ మహేష్ బాబు బర్త్‌డేని పురస్కరించుకుని అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా దర్శకుడు పరశురామ్ పేరుతో ఓ ఫేక్ అకౌంట్ ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ట్రాక్‌ని విడుదల చేయబోతున్నట్లుగా ఈ ట్విట్టర్‌ అకౌంట్‌లో ప్రకటించారు.


‘‘హల్లో.. సూపర్ ఫ్యాన్స్.. మీరంతా మన సూపర్‌స్టార్ మహేష్ బాబుగారి సర్కారు వారి పాటకు సంబంధించిన అప్‌డేట్ కోసం రెడీగా ఉన్నారా.. త్వరలో మన సూపర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని మా యూనిట్.. సర్కారు వారి పాట టైటిల్ ట్రాక్‌ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది..’’ అని ఈ ఫేక్ అకౌంట్‌లో ట్వీట్‌ చేయడమే కాకుండా.. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలో ఈ ట్రాక్ రెడీ అవుతున్న పిక్‌ను కూడా షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇది నిజమైన అకౌంట్ అనుకుని.. ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు. మరి ఈ అకౌంట్‌పై దర్శకుడు పరశురామ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.  


Advertisement
Advertisement
Advertisement