ఘనంగా పర్చూరు ఏఎంసీ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-06-18T06:18:11+05:30 IST

పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌, కార్యవర్గ సభ్యుల ప్ర మాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఏఎంసీ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించిం ది. కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామాని కి చెందిన జువ్వా శివరాంప్రసాద్‌ చైర్మన్‌గా ప్ర మాణ స్వీకారం చేశారు. వైస్‌ చైర్మన్‌గా గాజుల ఝాన్సీలక్ష్మి, పాలకవర్గ సభ్యులతో యార్డు కార్యద ర్శి ప్రసన్నకుమారి ప్రమాణ స్వీకారం చేయించా రు.

ఘనంగా పర్చూరు ఏఎంసీ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం
ప్రమాణస్వీకారోత్సవ సభలో మాట్లాడుతున్న చైర్మన్‌ జువ్వా శివరాంప్రసాద్‌

బాధ్యతలను స్వీకరించిన చైర్మన్‌ జువ్వా శివరాంప్రసాద్‌, సభ్యులు


పర్చూరు, జూన్‌ 17 : పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌, కార్యవర్గ సభ్యుల ప్ర మాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఏఎంసీ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించిం ది. కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామాని కి చెందిన జువ్వా శివరాంప్రసాద్‌ చైర్మన్‌గా ప్ర మాణ స్వీకారం చేశారు. వైస్‌ చైర్మన్‌గా గాజుల ఝాన్సీలక్ష్మి, పాలకవర్గ సభ్యులతో యార్డు కార్యద ర్శి ప్రసన్నకుమారి ప్రమాణ స్వీకారం చేయించా రు. తొలుత కుంకలమర్రు గ్రామం నుంచి పర్చూ రు చేరుకున్న జువ్వా, స్థానిక బొమ్మలసెంటర్‌ కూడలిలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా మార్కెట్‌ యార్డుకు తరలివెళ్లారు. చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శివరాంప్రసాద్‌కు పెద్దఎత్తున అభిమానులు ఘన స్వాగతం పలికారు. 


రైతు సంక్షేమానికి కృషి : చైౖర్మన్‌ 


రైతు సంక్షేమానికి కృషి చేస్తానని పర్చూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా నూతనంగా బాధ్యత లు స్వీకరించిన జువ్వా శివరాంప్రసాద్‌ చెప్పారు. తన సోదరుడు జువ్వా శ్రీనివాసరావు జిల్లా కార్య దర్శిగా పని చేసి అకాల మృతి చెందారని, తన కుటుంబంపై ఉన్న నమ్మకంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి జగన్‌మో హన్‌రెడ్డి తనను చైౖర్మన్‌ పదవికి ఎంపిక చేశారని చెప్పారు.  తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయ కుండా పార్టీ అభివృద్ధితోపాటు, రైతుల సంక్షేమా నికి కృషిచేస్తామన్నారు. స్వతాహాగా తాను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా రైతులకు మేలు చే కూర్చటమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రా వు, మాజీ జడ్పీటీసీ భవనం శ్రీనివాసరెడ్డి, సర్ప ంచ్‌లు మల్లా అంజమ్మ, వైసీపీ యువజన నా యకులు ఆకుల మధుబాబు, కొర్రపాటి అనిల్‌, గేరా రవీంధ్రనాథ్‌ఠాగూర్‌, కొడాలి ధర్మారావు, జి. రమేష్‌, దగ్గుబాటి రామకృష్ణ, సతీష్‌బాబు తది తరులు పాల్గొన్నారు. 


ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు


పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూ తన చైౖర్మన్‌ జువ్వా శివరాంప్రసాద్‌, పాలక వర్గ సభ్యులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గు రువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపా రు. జిల్లాలో పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ అ త్యంత ప్రతిష్టాత్మకమైందని, దీని పరిధిలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వేలహెక్టార్లకు పైగా రైతులు పం టలను సాగు చేస్తున్నారని, వారి సంక్షేమమే ధ్యే యంగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తె చ్చుకోవాలని ఏలూరి ఆకాంక్షించారు.


Updated Date - 2021-06-18T06:18:11+05:30 IST