ఆఫ్‌లైన్‌ విద్యకే తల్లిదండ్రుల మొగ్గు

ABN , First Publish Date - 2020-07-09T11:21:04+05:30 IST

కోవిడ్‌ 19 కారణంగా పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈక్రమంలో విదాయరంగం కూడా..

ఆఫ్‌లైన్‌ విద్యకే తల్లిదండ్రుల మొగ్గు

యూటీఎఫ్‌ సర్వేలో వెల్లడి .. కలెక్టర్‌, డీఈవోకు నివేదిక అందజేత


ఖానాపురంహవేలి, జూలై8: కోవిడ్‌ 19 కారణంగా పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈక్రమంలో విదాయరంగం కూడా తీవ్ర ప్రభావానికి లోనైంది. జిల్లాలో గత విద్యాసంవత్సరంలో నెలముందుగానే పాఠశాలలు మూతపడ్డాయి. ఎస్‌ఎ్‌ససీతో అన్నీ పరీక్షలు రద్దయ్యా యి. వేసవి సెలవుల అనంతరం విద్యాసంవత్సరం 2020-21 జూన్‌ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థల ప్రారంభంపై ఆంక్షలు కొనసాగుతున్నందున పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై యూటీఎఫ్‌ ఆన్‌లైన్‌ విద్యపై సర్వే చేపట్టింది. తల్లిదండ్రులు ఆఫ్‌లైన్‌ విద్యకే 93 శాతం మొగ్గు చూపారని జిల్లా యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, వీరబాబు తెలిపారు. 21 మండలాల్లో 144 గ్రామాలు, నగరాలు, పట్టణాలు వార్డుల్లో సర్వే నిర్వహించి 2345 మంది తల్లిదండ్రులు, 4860మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు 1642మందితో పాటు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు 703మంది అభిప్రాయం కూడా సర్వేలో సేకరించి నమోదు చేశారు.


వీరిలో 93శాతం మంది తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు పునఃప్రారంభించాలని తెలిపారు. ఈ సర్వే నివేదికను బుధవారం డీఈవో మదన్‌మోహన్‌కు సంఘం రాష్ట్రఉపాధ్యక్షుడు చావా దుర్గాభవా ని, రాష్ట్ర కార్యదర్శి బండి నర్సింహారావు, నివేదిక కాపీని అందించారు. నివేదికను కలెక్టర్‌కు కూడా అందించామని వారు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ మహ్మద్‌అలీ, వెంకన్న, నాగేశ్వరరావు, శ్రీకాంత్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T11:21:04+05:30 IST