యూట్యూబ్‌లో పేరెంట్స్‌ చెక్‌

ABN , First Publish Date - 2021-02-27T09:24:08+05:30 IST

‘యూట్యూబ్‌’లో తమ పిల్లలు ఏమి చూస్తున్నారన్నది తలిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. పిల్లలు ఏది చూడాలి లేదంటే ఏమి చూస్తున్నారనేది తనిఖీ చేసేందుకు

యూట్యూబ్‌లో పేరెంట్స్‌ చెక్‌

‘యూట్యూబ్‌’లో తమ పిల్లలు ఏమి చూస్తున్నారన్నది తలిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. పిల్లలు  ఏది చూడాలి లేదంటే ఏమి చూస్తున్నారనేది తనిఖీ చేసేందుకు సూపర్వైజ్‌ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇంటికే పరిమితమైన పిల్లలు పెద్దల ఫోన్లు తీసుకుని అన్నీ చూసేస్తున్నారు.  మరోమాటలో చెప్పాంటే పిల్లలకు యాక్సెస్‌ పెరిగింది. అయితే ఈ ఫీచర్‌తో పిల్లలు వీక్షిస్తున్న కంటెంట్‌ను పెద్దలు మానిటర్‌ చేయవచ్చు. 


ఇందులో మూడు ఫీచర్లు ఉంటాయి. 

తొమ్మిది సంవత్సరాలకు మించి వయసు ఉన్న పిల్లలు ఎక్స్‌ప్లోర్‌ జాబితాలోకి వస్తారు. వ్లాగ్స్‌, ట్యుటోరియల్స్‌, గేమ్స్‌, మ్యూజిక్‌ అందుబాటులో ఉంటుంది.  

 రెండోది ఎక్స్‌ప్లోర్‌ మోర్‌. ఇది పదమూడేళ్ళ వయసు వచ్చిన పిల్లలకు ఉద్దేశించినది. ఇందులో బ్రౌజింగ్‌ సదుపాయానికి తోడు లైవ్‌ స్ట్రీమింగ్‌లను వీక్షించే సౌలభ్యం ఉంటుంది. 

మూడోది మోస్ట్‌ ఆఫ్‌ యూట్యూబ్‌. పేరుకు తగ్గట్టు ఇందులో ఏదైనా చూడవచ్చు. అయితే పిల్లల వయసునుబట్టి ఎవరు ఏది చూడవచ్చన్నది ఇకపై పేరెంట్స్‌ సెట్‌ చేయవచ్చు. 

అలాగే పిల్లలు వీక్షించిన వాటి చరిత్రనూ తెలుసుకోవచ్చు. మొత్తానికి పిల్లలను తలిదండ్రులు తమ అదుపులో పెట్టుకోవచ్చన్నమాట!

Updated Date - 2021-02-27T09:24:08+05:30 IST