Abn logo
Sep 22 2021 @ 22:20PM

ప్రశాంతంగా తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు

సూళ్లూరుపేట లో ఎన్నికలకు హాజరైన తల్లిదండ్రులు

గూడూరు, సెప్టెంబరు 22: గూడూరు పట్టణ, మండలంలో బుధవారం నిర్వహించిన పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈవో సునీల్‌కుమార్‌ తెలిపారు. 90 పాఠశాలలకు గాను 88 పాఠశాలల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. చెన్నూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, పారిచెర్లరాజుపాళెం ప్రాథమిక పాఠశాలల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదన్నారు. చిల్లకూరు మండలంలో  72 పాఠశాలలుండగా,  69 పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. చిల్లకూరు జడ్పీ ఉన్నత పాఠశాల, బూదనం ప్రాథమిక పాఠశాలలో కోరం లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదని, తిమ్మనగారిపాళెంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలు మాత్రమే నిర్వహించలేదని ఎంఈవో వెంకటకృష్ణయ్య తెలిపారు. 

సూళ్లూరుపేట :సూళ్లూరుపేట మండలంలో  53 ప్రాథమిక పాఠశాలలు, 6 ప్రాథమికోన్నత పాఠశాలలు,  9 ఉన్నత పాఠశాలు,  2 ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించినట్లు ఎంఈవో మస్తానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 36 కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని 37 పాఠశాలల్లో పోటీ జరిగిందని,  రాగన్నపట్టెడ పాఠశాలలో గొడవ జరగడం, బొందలపాళెం పాఠశాల, రెండు ఎయిడెడ్‌ పాఠశాలల్లో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. 

సైదాపురం: మండలంలో ఎంఈవో నందకుమార్‌  ఎన్నికలను పర్యవేక్షించారు.  మండలంలో 89 పాఠశాలలుండగా, 88 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించి విద్యాకమిటీ సభ్యుల తో ప్రమాణస్వీకారం చేయించినట్లు తెలిపారు.

బాలాయపల్లి: మండలంలోని ఐదు ఉన్నత పాఠశాలలు, 70 ప్రాథమిక పాఠశాలల్లో బుదవారం పాఠశాల కమిటీ ఎన్నికలు నిర్వహించగా, ఒకటి తప్ప అన్ని పాఠశాలల్లో ప్రశాంతంగా ముగిశాయి. కడగుంట మెయిన్‌ పాఠశాలలో మూడు తరగతుల వరకు ఎన్నిక సజావుగా సాగింది. నాలుగవ తరగతి నుంచి రాజకీయ కారణాలతో వివాదం ఏర్పడడంతో  తల్లితండ్రులు ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దీంతో కోరంలేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. తిరిగి ఎన్నికలు నిర్వహించేటప్పుడు పాఠశాలలో రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు కోరుతున్నారు.

ఓజిలి : ఓజిలి మండలంలోని 54 ప్రాఽథమిక, 7 ప్రాఽథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలతోపాటు వాకాటివారి కండ్రిగలోని ఏకలవ్య గురుకుల పాఠశాల, చిల్లమానుచేను బాలుర గురుకుల పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. 43 పాఠశాలల్లో ఏకగ్రీవంగా కమిటీలను ఎన్నుకోగా, 17 పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. కోరం లేకపోవడంతో 6 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి.  ఏకలవ్య గురుకుల పాఠశాల కమిటీ చైర్మన్‌గా విన్నమాలకు చెందిన విన్నమాల మునిరామకృష్ణయ్య, వైస్‌ఛైర్మన్‌గా ఓజిలికి చెందిన ఈగ రజినిు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ కె ప్రసాద్‌ తెలిపారు.  

      

చిట్టమూరు : చిట్టమూరు మండలంలోని 83 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించారు. అరవపాళెం, మెట్టు ఉన్నత పాఠశాలల చైర్మన్లుగా ఎల్లసిరి సుమతి, తాటిపర్తి శశికుమార్‌ ఎన్నికయ్యారు.


కోట : మండల పరిధిలోని . 8 ఉన్నత పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత పాఠశాలలు, 61 ప్రాథమిక పాఠశాలలు, 4 గురుకుల పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. 36 పాఠశాలల్లో  ఏకగ్రీవంకాగా 40 పాఠశాలల్లో ఆ ఎన్నికలు జరిగాయి. కోటలోని  బాలయోగి గురుకులంలో కోరంలేక ఎన్నిక వాయిదాపడింది.  విద్యానగర్‌ బీసీ బాలికల గురుకులంలో ఊనుగుంటపాళెంకు చెందిన రాజమ్మ చైర్మన్‌గాను,  మల్లాంకు చెందిన సుబ్రహ్మణ్యం వైస్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.