స్కూల్స్‌నే ఎందుకు మూస్తున్నారు? బార్లు ఎందుకు మూయరు?

ABN , First Publish Date - 2022-01-17T21:35:36+05:30 IST

తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం..

స్కూల్స్‌నే ఎందుకు మూస్తున్నారు? బార్లు ఎందుకు మూయరు?

విద్యార్థుల పేరెంట్స్


హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం.. వైన్స్, బార్లు ఎందుకు మూయరని ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ స్థలాల్లో లేని నియంత్రణ విద్యా వ్యవస్థపై ఎందుకు పెట్టారని, వెంటనే స్కూల్స్ తెరవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే తమ పిల్లలు మళ్లీ బడిబాట పడుతుంటే ఇలా సెలవుల పేరుతో ఇంట్లో కూర్చోబెట్టడం సరికాదంటున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-01-17T21:35:36+05:30 IST