కరోనా కాలంలో తల్లిదండ్రులను కోల్పోయారు. సాయం కోసం శిబిరానికి రావడంతోనే.. ఆ అనాథ అక్కాచెల్లెళ్ల జీవితమే మారిపోయింది..

ABN , First Publish Date - 2021-10-13T18:03:48+05:30 IST

దేశంలోని కొంతమంది రాజకీయ నేతలు..

కరోనా కాలంలో తల్లిదండ్రులను కోల్పోయారు. సాయం కోసం శిబిరానికి రావడంతోనే.. ఆ అనాథ అక్కాచెల్లెళ్ల జీవితమే మారిపోయింది..

దేశంలోని కొంతమంది రాజకీయ నేతలు తమలోని దాతృత్వాన్ని చాటుకుంటుంటారు. వారిలో ఒకరే రాజస్థాన్ లోని మహువాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ హుడ్లా. ఆయన మరోమారు తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఎమ్మెల్యే ఓం ప్రకాష్ ఇటీవల ఇద్దరు అనాథ యువతులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.


ఆ యువతుల చదువుతో పాటు పెళ్లికి అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని ఆయన ఒక బహిరంగ సభలో ప్రకటించారు. ఓం ప్రకాష్ గతంలో తన ఖర్చులతో సామూహిక వివాహాలు చేశారు. కేసరా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ యువతులిద్దరూ సహాయం కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చారని, అక్కడ ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకున్నారని, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారికి తక్షణం సహాయం అందించాలని అధికారులను ఆదేశించారన్నారు. తరువాత ఎమ్మెల్యే ఈ ఇద్దరు యువతులను దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారని, వారి చదువు, పెళ్లిళ్ల బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారన్నారు. కాగా ఎమ్మెల్యే హామీతో ఆ ఇద్దరు యువతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Updated Date - 2021-10-13T18:03:48+05:30 IST