పిల్లల ఆరోగ్యం పెద్దల చేతుల్లో!

ABN , First Publish Date - 2020-10-12T05:30:09+05:30 IST

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ‘కొవిడ్‌’ సోకే అవకాశం చాలా తక్కువ. అయినా కూడా పిల్లల సంరక్షణకు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు వైద్యనిపుణులు...

పిల్లల ఆరోగ్యం పెద్దల చేతుల్లో!

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ‘కొవిడ్‌’ సోకే అవకాశం చాలా తక్కువ. అయినా కూడా పిల్లల సంరక్షణకు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు వైద్యనిపుణులు.


  1. పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం, వాటిని పాటించేలా చూడడం ప్రతి రోజూ ఓ పనిలా పెట్టుకోండి. చేతులు కడుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు అని, తద్వారా వైరస్‌ ఇతరులకు సోకదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో తల్లితండ్రులదే ప్రధాన బాధ్యత.
  2. పిల్లలకు మీరే ఆదర్శంగా ఉండండి. తల్లితండ్రులు తరచూ చేతులు శుభ్రం చేసుకుంటే పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. 
  3. ఇంట్లో కూడా రోజూ కొద్ది సమయం చిన్న చిన్న వ్యాయామాలు, డ్యాన్స్‌ లాంటి పలు యాక్టివిటీలు పిల్లలతో  చేయించండి. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 
  4. పిల్లలు సామాజికంగా, భావోద్వేగపరంగా ఇబ్బంది పడుతున్నారా? మీ నుంచి ఏదైనా మద్దతు అవసరం ఉందేమో పరిశీలించండి. 
  5. పిల్లల ప్రవర్తనలో మార్పు, ఒత్తిడికి సంబంధించిన లక్షణాలున్నాయేమో గమనించండి.

Updated Date - 2020-10-12T05:30:09+05:30 IST