గురువు చేతిలో అత్యాచారానికి గురైన 11 ఏళ్ల బాలిక.. అనంతరం తల్లిదండ్రుల వేధింపులు.. దీంతో ఆ బాలిక ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-12-25T18:50:29+05:30 IST

దేవుడి కంటే తల్లిదండ్రులు, గురువు గొప్ప వారని అంటారు. అయితే ఆ బాలికకు వారే నరకం చూపించారు.

గురువు చేతిలో అత్యాచారానికి గురైన 11 ఏళ్ల బాలిక.. అనంతరం తల్లిదండ్రుల వేధింపులు.. దీంతో ఆ బాలిక ఏం చేసిందంటే..

దేవుడి కంటే తల్లిదండ్రులు, గురువు గొప్ప వారని అంటారు. అయితే ఆ బాలికకు వారే నరకం చూపించారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురై తీవ్ర వేదన అనుభవిస్తున్న కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారు. తమ పరువు తీసిందని కొడుతున్నారు. దీంతో ఆ బాలిక చైల్డ్ హెల్ప్ లైన్‌కు లేఖ రాసింది. రాజస్థాన్‌లోని ఝంఝును ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ఝంఝునుకు సమీపంలోని సింఘానా ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ప్రధానోపాధ్యాయుడు గత నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి అదే పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా సహాయం చేశారు. దీంతో ఆ బాలిక చైల్డ్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. వెంటనే విద్యాశాఖ ఆ ముగ్గురిని సస్పెండ్ చేసింది. అలా ఫిర్యాదు చేసినందుకు ఆ బాలికపై తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. 


సమాజంలో తమ పరువు తీసిందని ఆమెను వేధిస్తున్నారు. దీంతో ఆ బాలిక మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్‌ను ఆశ్రయించింది. `నాకు బతకాలని లేదు. నేను చనిపోతున్నాను. మా అమ్మానాన్న రోజూ నన్ను కొడుతున్నారు. ఎక్కడికైనా వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోమని తిడుతున్నారు` అంటూ ఆ బాలిక రాసిన లేఖ చదివి చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు స్పందించారు. వెంటనే ఆ బాలికను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ బాలికను వసతి గృహానికి తరలించారు. తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-12-25T18:50:29+05:30 IST