పరిశుభ్ర వాతావరణంతో వ్యాధులకు దూరం

ABN , First Publish Date - 2021-11-28T04:27:53+05:30 IST

పరిశుభ్ర వాతావరణంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఎమ్మెల్యే కాకాణి గోవ ర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మండ

పరిశుభ్ర వాతావరణంతో వ్యాధులకు దూరం
చెత్తబుట్టలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కాకాణి

ముత్తుకూరు, నవంబరు27:  పరిశుభ్ర వాతావరణంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని  ఎమ్మెల్యే కాకాణి గోవ ర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పిడతాపోలూరులో శనివారం ఎన్‌సీఎల్‌ బిల్డ్‌ టెక్‌ సంస్థ సౌజన్యంతో గ్రామ స్థులకు  చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  జరిగిన సభలో ఆయన పరిసరాల పరిశుభ్రత ద్వారా వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవనం సాగిం చవచ్చన్నారు. గ్రామంలోని 1400 కుటుంబాలకు ఎన్‌సీఎల్‌ బిల్డ్‌ టెక్‌ సంస్థ 2800 చెత్తబుట్టలను అందజేయడం అభినందనీయమన్నారు.  అంతకుముందు ఆయన ముత్తుకూరులోని సీవీఆర్‌ మధురానగర్‌లో పర్యటించారు. వరదల సమయంలో ప్రాణాలకు తెగించి, ప్రజలను కాపాడిన మధురానగర్‌ మత్స్యకారులను  వైసీపీ మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో అభినందించి, ఘనంగా సన్మానించారు.  వారికి చేతిగడియారాలు బహూ కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గండవరపు సుగుణ, మండల ఉపాధ్యక్షుడు పోలిరెడ్డి చిన్నపరెడ్డి, జడ్పీటీసీ బందెల వెంకటరమణయ్య, నాయకులు కాకుటూరు లక్ష్మణరెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, గండవరపు సూరి, అగ్నిమస్తాన్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T04:27:53+05:30 IST