Abn logo
Jan 20 2021 @ 16:05PM

నా బిడ్డను ఆశీర్వదించండి: పరిటాల శ్రీరామ్

ఇంటర్నెట్ డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తన బిడ్డ నామకరణోత్సవం గురించి ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన తండ్రే తిరిగి తమ కుటుంబంలోకి వచ్చారంటూ ట్వీట్ చేశారు. తన తండ్రి పేరైన ‘పరిటాల రవీంద్ర’ పేరునే తన కుమారుడికి పెట్టామని.. ఈ విషయం పంచుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. పరిటాల రవీంద్ర పేరుకు సార్థకత చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. చిరంజీవి పరిటాల రవీంద్రకు ఆశీస్సులు అందించాలని కోరారు.


Advertisement
Advertisement
Advertisement