Abn logo
Sep 28 2021 @ 00:48AM

బండి పరుశురాంను అభినందించిన పరిటాల సునీత

పరుశురాంను అభినందిస్తున్న పరిటాల సునీత

అనంతపురం టౌన / రూరల్‌/శింగనమల,సెప్టెంబరు27: టీఎనఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శిగా నియమితు లైన బండి పరుశురాంను మాజీ మంత్రి పరిటాల సునీత అభినందించారు. సోమవారం జిల్లా కేం ద్రంలోని ఆమె స్వగృహంలో పరుశురాంతో పాటు అనంతపురం రూ రల్‌, రాప్తాడు, ఆత్మ కూరు మండలాల  పలువురు నాయకులు మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి పరుశురాంకు వారు శుభాకాంక్షలు తెలిపారు. రూరల్‌ మండల కన్వీనర్‌ చల్లా జయకృష్ణ, రాగేమురళి, పూజారప్ప, గంగుల కుంట రమణ, శంకర్‌, జయరాములు, నరేష్‌, రాము తదితరులు పాల్గొన్నారు.  అలాగే టీఎనఎస్‌ఎఫ్‌లో తన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు టీడీపీ నాయకులు కాలవ శ్రీనివాసులు, ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, జేసీ పవనరెడ్డి, ఎంఎస్‌ రాజు, దండు శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.