Abn logo
Oct 22 2021 @ 13:38PM

కాలిఫోర్నియా పార్క్ కైలీ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

కాలిఫోర్నియా: తెలుగు వారికి మన పండగులంటే ఎంతో ప్రీతి. వారు ఎక్కడున్నా తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే పండగలను జరుపుకోవడం వదులుకోరు. పండగ అంటే కేవలం సెలబ్రేషన్స్ కాదు. మన సంస్కృతి తర్వాత తరాలకు వారసత్వంగా అందించే ఒక క్రమానుగత సంప్రదాయం. అందుకే పండగ జరుపుకోవడం ద్వారా సంస్కృతిని భావి తరాలకు అందించడంతో పాటు కుటుంబ బంధాలను బలపరిచే వారధిగా చెప్పవచ్చు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా మరవకు మన సంస్కృతి మరవకు మన పండగలు అంటూ ప్రతి తెలుగు పండగను జరుపుకుంటున్నారు కాలిఫోర్నియా పార్క్ కైలీ తెలుగు కమ్యూనిటీ. 

శాన్ జోస్, కాలిఫోర్నియాలో ఉంటున్న 100 కుటుంబాలతో ఏర్పడిన కమ్యూనిటీ ఇది. ఏ పండగ అయినా ఉమ్మడిగా జరుపుకుంటారు. అలాగే బే ల్యాండ్ పార్క్, సన్నీవేల్, కాలిఫోర్నియాలో దసరా, బతుకమ్మ పండుగను ఘనంగా జరపుకున్నది ఈ కమ్యూనిటీ. కోలాటం, గ్రాండ్ గాలాతో ఉత్సవం కనులపండువగా జరుపుకొన్నారు. సుమారు 300 మందికి పైగా సభ్యులు ఎంతో ఉత్సాహంతో ఇందులో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...