పార్కులను అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2020-09-19T05:32:01+05:30 IST

అన్ని డివిజన్లలో పార్కులను అభివృద్ధి చేయాలని నగర మేయర్‌ వై సునీ ల్‌రావు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశిం

పార్కులను అభివృద్ధి చేయాలి

అసంపూర్తి పనులుచేసిన కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి 

వారంరోజుల్లో పనులు పూర్తైన పార్కులను ప్రారంభించాలి 

మేయర్‌ వై సునీల్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 18: అన్ని డివిజన్లలో పార్కులను అభివృద్ధి చేయాలని నగర మేయర్‌ వై సునీ ల్‌రావు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం ఆయన కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికా రులతో పార్కుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు అందమైన పార్కులు, ఓపెన్‌జిమ్స్‌, వాకింగ్‌ట్రాక్స్‌ వంటి సౌకర్యాలను కల్పించా ల్సిన బాధ్యత కూడా మనపై ఉందని అన్నారు. పార్కుల న్నిటినీ అభివృద్ధి చేసేందుకు వెంటనే ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జ్యోతినగర్‌ పార్కుతో సహ అన్ని పార్కుల్లో గ్రీనరీ, అందమైన మొక్కలు, చిన్నపిల్లల ఆటవస్తువులు, పెద్దలు కూడా కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే విధంగా చక్కటి కుర్చీలు, అక్కడక్కడ వారి కోసం కూడా ఆట వస్తువులను ఏర్పాటు చేయాలని అన్నారు.


అయితే అన్ని పార్కుల్లో ఒకే డిజై న్‌తో మూసపద్ధతిలో కాకుండా ఒక్కో పార్కుకు ఒకటి, రెండు ఎఫెక్ట్స్‌ ఉండే విధంగా డిజైన్‌ను రూపొంచి ఆమేరకు అంచనాలను తయారు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న వాటిని వారం, పది రోజుల్లో ప్రారంభోత్సవాన్ని సిద్ధం చేయాలని సూచిం చారు. పార్కు అభివృద్ధి పనులను టెండర్‌లలో తీసుకొని పనులు ప్రారంభించకుండా, మధ్యలో వదిలివేసిన కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు ఇవ్వాలని అన్నారు. వారు స్పందించకుంటే వారి అగ్రిమెంట్‌ రద్దు చేసి తిరిగి టెండర్లను నిర్వహించాలని మేయర్‌ ఆదేశించారు. కమిషనర్‌ క్రాంతి మాట్లాడుతూ జ్యోతి నగర్‌ పార్కుతో సహా అన్ని పార్కుల్లో డ్రెయి నేజీలు కూడా నిర్మిం చాలని, పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశిం చారు. కోర్టు వివా దంలో ఉన్న స్థలా లను గుర్తించి వాటిని తమ దృష్టికి తీసుకు రావాలని అన్నారు. మిగిలిన పార్కు స్థలాల్లో పార్కు పనులను ప్రారంభించాలని, త్వరలోనే పనులు పూర్తయిన పార్కులను ప్రారంభించి ప్రజలకు అందుబాటు లోకి తేవాలని సూచించారు. సమావేశంలో ఈఈ రామన్‌, ఏఈ చైతన్య పాల్గొన్నారు.


కార్మికులంతా విధిగా డ్రెస్‌కోడ్‌ను పాటించాలి.. 

నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులంతా విధిగా డ్రెస్‌కోడ్‌ను పాటించి విధులకు హాజరుకావాలని మేయర్‌ వై సునీల్‌రావు అన్నారు. శుక్రవారం కళాభారతి ఆడిటోరి యంలో కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి 25మంది మున్సిపల్‌ ఎలక్ర్టికల్‌ విభాగంలో పనిచేసే కార్మికులకు డ్రెస్‌కోడ్‌ యాప్రాన్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని పారిశుధ్య, నీటి నిర్వహణ, వీధిదీపాల నిర్వహణ తదితర విభాగాల్లో పనిచేసే కార్మికులందరికీ వేర్వేరురంగుల్లో ఉన్న ఆఫ్రాన్‌ లను పంపిణీ చేశామని, ఆయా విభాగాల కార్మికులంతా కూడా ఆ రంగు ఆఫ్రాన్‌లతోనే విధులకు హాజరుకావాలని సూచించారు.


డ్రెస్‌ కోడ్‌ లేకుండా సాధారణ దుస్తులతో విధులకు హాజరైతే వారికి గైర్హాజరు వేస్తామని చెప్పారు. డ్రెస్‌కోడ్‌ వాడడం వలన మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించడం సులభమవుతుందని అన్నారు. ప్రజలు కూడా గుర్తించి వారి సమస్యలను వివరిస్తారని చెప్పారు. ఇకపై డ్రెస్‌ కోడ్‌ను పరిశీలిస్తామని, కార్మికులంతా కూడా విధిగా డ్రెస్‌కోడ్‌తో హాజరుకావాలని కమిషనర్‌ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, ఐలేందర్‌యాదవ్‌, షర్ఫొద్దీన్‌, బర్కత్‌ అలీ, ఈఈ రామన్‌, ఎలక్ర్టికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T05:32:01+05:30 IST