లాక్‌డౌన్ సమయంలో బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయ్...

ABN , First Publish Date - 2020-06-10T11:53:42+05:30 IST

కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశంలో పార్లే -జి బిస్కెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి....

లాక్‌డౌన్ సమయంలో బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయ్...

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశంలో పార్లే -జి బిస్కెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చేసిన నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పార్లే -జి బిస్కెట్ల అమ్మకాలు 8 దశాబ్ధాల్లోనే అత్యధికంగా అమ్మకాలు సాగాయని కంపెనీ ప్రకటించింది. లాక్‌డౌన్ వల్ల సులభంగా లభించే నిత్యావసర ఆహారపదార్థమైన బిస్కెట్ల విక్రయాలు రికార్డుస్థాయిలో జరిగాయి. దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పార్లే -జి బిస్కెట్లను పెద్ద మొత్తాల్లో కొని పంపిణీ చేశాయని, దీనివల్ల బిస్కెట్ల అమ్మకాలు దేశంలో రికార్డు స్థాయిలో సాగాయని కంపెనీ వెల్లడించింది. దేశంలో ఉన్న బిస్కెట్లు విక్రయించడంతో వారం రోజుల్లో బిస్కెట్లను దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్ లెట్లకు పంపిస్తామని పార్లే జి ప్రకటించింది. దేశంలోని 120 ఫ్యాక్టరీల్లో మార్చి 25వతేదీనుంచే బిస్కెట్ల ఉత్పత్తి ప్రారంభించామని కంపెనీ తెలిపింది. పార్లే -జి బిస్కెట్లు కిలో వందరూపాయల లోపు ధరలో లభిస్తున్నందున వీటికి మార్కెట్ లో డిమాండు బాగా పెరిగిందని కంపెనీ వివరించింది. 

Updated Date - 2020-06-10T11:53:42+05:30 IST