ఉభయ సభల్లో గందరగోళం

ABN , First Publish Date - 2021-07-22T17:11:50+05:30 IST

ఒకవైపు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో వర్షాకాల...

ఉభయ సభల్లో గందరగోళం

న్యూఢిల్లీ: ఒకవైపు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో వర్షాకాల సమావేశాలు నడుస్తుండగా, మరోవైపు పార్లమెంట్ బయట జంతర్ మంతర్ వద్ద రైతుల పార్లమెంట్ కొనసాగుతోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో విపక్ష నేతలు కరోనా, పెగాసన్, ధరల పెరుగుదల మొదలైన అంశాలపై తమ గళం వినిపిస్తుండగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే నేపధ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. 


సభలో బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరుగుతోంది. దీనిలో ప్రధానమంత్రితో పాటు హోంశాఖమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. కాగా లోక్‌సభలో రైతుల సమస్యను లేవనెత్తిన కాంగ్రెస్ సాగు చట్టాలను రద్దు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కాగా పార్లమెంట్ వెలుపల ఉదయం 11 గంటలకు రైతులు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన ప్రారంభించారు. దీనిని సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగించనున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2021-07-22T17:11:50+05:30 IST