జూన్ 3న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం

ABN , First Publish Date - 2020-05-28T15:43:10+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ఆపత్కాలంలో లాక్‌డౌన్ వల్ల స్తంభించి పోయిన పార్లమెంటు కార్యకలాపాలు జూన్ 3వతేదీన పునర్ ప్రారంభం కానున్నాయి....

జూన్ 3న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ఆపత్కాలంలో లాక్‌డౌన్ వల్ల స్తంభించి పోయిన పార్లమెంటు కార్యకలాపాలు జూన్ 3వతేదీన పునర్ ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం జూన్ 3వతేదీన పార్లమెంటు హౌస్ లో నిర్వహించాలని నిర్ణయించారు. లాక్ డౌన్ రెండు నెలల తర్వాత మొదటిసారి పార్లమెంటు సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. హోంమంత్రిత్వశాఖ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తూ ఆ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ సభ్యులకు సమాచారం అందించారు. కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్ డౌన్ పరిస్థితులపై హోంమంత్రిత్వశాఖ అధికారులు స్టాండింగ్ కమిటీకి నివేదించనున్నారు. ఆకస్మికంగా  లాక్ డౌన్ విధించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది వలసకార్మికులు పడిన కష్టనష్టాల గురించి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నిస్తామని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. కరోనా లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన 18 రాజ్యసభ సభ్యుల ఎన్నిక చేపట్టే విషయాన్ని చర్చించనున్నారు. 

Updated Date - 2020-05-28T15:43:10+05:30 IST