Abn logo
Jul 19 2021 @ 11:13AM

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రమాణం

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో నలుగురు కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, బెళగాం ఎంపీ మంగళ్‌ సురేష్‌ అంగడీ ప్రమాణస్వీకారం చేశారు. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సందేశమిచ్చారు. కరోనా ప్రభావంతో ప్రత్యేక్ష సమావేశాలు నిర్వహించలేకపోయామని, సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. దేశ ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 5 ఆర్డినెన్సులతో పాటు 29 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. బిల్లులకే మొత్త సమయం కేటాయిస్తే సామాన్యుల సమస్యలపై ఎప్పుడు చర్చిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

క్రైమ్ మరిన్ని...