యామ్‌ గలౌటీ అల్టా తవా పరోటా

ABN , First Publish Date - 2021-11-20T18:36:17+05:30 IST

యామ్‌ (కంద) - 120గ్రా, శెనగపప్పు (వేయించినది) - 30గ్రా, జీడిపప్పు- 40 గ్రా, ఉల్లిపాయలు - 40 గ్రా, దేశీ నెయ్యి - 30 గ్రా, యాలకులు - 1, దాల్చిన చెక్క - 1, బిర్యానీ ఆకు- 1, జాపత్రి -1, నల్ల యాలికలు

యామ్‌ గలౌటీ అల్టా తవా పరోటా

వీకెండ్‌లో క్రేజీ వెజ్‌

కార్తికమాసం... ఇంట్లో పూజలు, నైవేద్యాలతో బిజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో వెజ్‌లో కాస్త భిన్నమైన వంటలను ట్రై చేయాలంటే ఇదిగో వీటిని ఎంచుకోవచ్చు. టోఫు మేదు వడ, యామ్‌ గలౌటీ అల్టా తవా పరోటా, సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌ వంటి రెసిపీలు వీకెండ్‌లో మీ జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయి. 


కావాల్సిన పదార్థాలు: యామ్‌ (కంద) - 120గ్రా, శెనగపప్పు (వేయించినది) - 30గ్రా, జీడిపప్పు- 40 గ్రా, ఉల్లిపాయలు - 40 గ్రా, దేశీ నెయ్యి - 30 గ్రా, యాలకులు - 1, దాల్చిన చెక్క - 1, బిర్యానీ ఆకు- 1, జాపత్రి -1, నల్ల యాలికలు- 1, ఉప్పు- 15 గ్రా, సోంపు- 2 గ్రా, వెల్లుల్లి - 5 గ్రా, అల్లం- 3గ్రా, కాశ్మీరీ మిర్చి పొడి- 15 గ్రా, ఎల్లో చిల్లీ పౌడర్‌ -5 గ్రా, మైదా- 70గ్రా, పంచదార- 5 గ్రా, వనస్పతి- 20 గ్రా, పుదీనా ఆకులు- 10 గ్రా,  కొత్తిమీర- 30 గ్రా, చాట్‌ మసాలా- 15గ్రా, నిమ్మ- 1, నల్ల ఉప్పు- 5 గ్రా, జీరా -3 గ్రా.


తయారీ విధానం: ముందుగా కంద శుభ్రంగా కడిగి పైన పొట్టు తీయాలి. ఓ పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, జీడిపప్పు వేసి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించాలి. ఆ తరువాత వీటిని పేస్ట్‌లా చేసుకోవాలి.  ఇప్పుడు మరో పాత్రలో పెండలం ముక్కలు తీసుకుని ఉడకపెట్టి మెత్తగా అయిన తరువాత చల్లార్చాలి. ఇప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,  జాపత్రి, నల్లయాలకులు, సొంపును వేయించి, మెత్తగా నూరుకోవాలి. అనంతరం ఓ మిక్సింగ్‌ గిన్నె తీసుకుని వేయించిన జీడిపప్పు, ఉల్లిపాయల పేస్ట్‌, వేగించిన శెనగపప్పు పొడి,  ఎండుమిరప, ఎల్లోచిల్లీ పౌడర్‌, పెండలం కలిపి తగినంత ఉప్పు జోడించి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి వేసి కొద్దిగా వేయించాలి. అనంతరం ఫ్రిజ్‌లో కొంతసేపు ఉంచాలి. ఓ గిన్నెలో మైదా, పంచదార, తగినంత ఉప్పు, వనస్పతి తీసుకుని పరోటా పిండి కలిపినట్లుగా కలిపి పరోటా చేయాలి. పుదీనా చట్నీ చేయడం కోసం పుదీనా ఆకులు, కొత్తిమీర, నిమ్మ, ఉప్పు, చాట్‌ మసాలా, వేగించిన జీలకర్ర, తగినంత నీరు జోడించాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లో దాచిన కంద మిక్సర్‌ తీసి గలౌటీ కబాబ్‌లు చేసుకోవాలి. వీటిని తవాపై నెయ్యి వేసి ఉడికించుకోవాలి. వీటికి కాంబినేషన్‌గా చిన్న తవా పరోటాలను చేసి పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-11-20T18:36:17+05:30 IST