ప్రమాదాల నియంత్రణలో భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2022-01-20T05:30:00+05:30 IST

ప్రమాదాల నియంత్రణలో భాగస్వామ్యం కావాలి

ప్రమాదాల నియంత్రణలో  భాగస్వామ్యం కావాలి
మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌/కొడంగల్‌/బొంరా్‌సపేట్‌, జనవరి20 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పట్ల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలుంటాయని, ఇందులో మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంధనల పట్ల అవగాహన లేకపోవడం లాంటివి ప్రధానమన్నారు. వికారాబాద్‌, తాండూరు పట్టణాలకు ట్రాఫిక్‌ ఆర్‌ఎ్‌సఐ లను నియమించామని, అదేవిధంగా చన్గోముల్‌, కొడంగల్‌లలో హైవే పోలీ్‌సస్టేషన్లు ఉన్నాయన్నారు. పట్టణాల్లో  కిరాణా, ఇతర దుకాణాల యజమానులతో మాట్లాడి పార్కింగ్‌  ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రషీద్‌, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఆర్‌ఎ్‌సఐ శివ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  కాగా  శాంతిభద్రతల పరిరక్షణలో కఠిన చర్యలు అమలు చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం డీఎస్పీ శ్రీనివా్‌సతో కలిసి కొడంగల్‌, బొంరా్‌సపేట్‌ పోలీ్‌సస్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీ్‌సస్టేషన్‌లోని క్వార్టర్స్‌ను పరిశీలించి శిథిలావస్థకు చేరుకున్న వాటిని తొలగించి ప్రహరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగిస్తామన్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారిలో జరుగుతన్న రోడ్డు ప్రమాదాల్లో 16 స్థానాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సీఐ అప్పయ్య, ఎస్సైలు సామ్యానాయక్‌, ప్రశాంత్‌వర్ధన్‌, భవానీ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-01-20T05:30:00+05:30 IST