Abn logo
Mar 26 2020 @ 23:18PM

ఆయన మెగా హృదయం ఉన్న మానవతావాది: పరుచూరి

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీతో ఉగాది పండుగ మరింత స్పెషల్‌గా మారింది. తన ట్వీట్స్‌తో చిరు అందరినీ అలరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చిరు స్పందించారు. చిరు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


దీనిపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలీలో స్పందించారు. చిరంజీవిని మెగా హృదయం ఉన్న మానవతావాదిగా ఆయన అభివర్ణించారు. ‘‘చలనచిత్ర కార్మికులు, అసంఘటిత కార్మికులు.. లాక్‌డౌన్ మూలంగా దినసరి వేతనముతో పని చేసే వేలమంది కార్మికులకు ఉపాధి లేకుండా పోవడంతో , కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి , తాను మెగాస్టారే.. కాదు మెగా హృదయం వున్న మానవతావాది అని నిరూపించుకున్న చిరంజీవి గారికి హృదయాభివందనం’’ అంటూ పరుచూరి ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement