నవ్వులాటగా ఉందా?.. : షట్లర్‌ కశ్యప్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-03-20T13:34:20+05:30 IST

ప్రపంచమంతా కొవిడ్‌-19 మహమ్మారితో వణికిపోతూ

నవ్వులాటగా ఉందా?.. : షట్లర్‌ కశ్యప్‌ ఆగ్రహం

హైదరాబాద్/న్యూఢిల్లీ : ప్రపంచమంతా కొవిడ్‌-19 మహమ్మారితో వణికిపోతూ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటుంటే.. అథ్లెట్లు ఒలింపిక్స్‌ శిక్షణను కొనసాగించాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సూచించడంపై భారత స్టార్‌ షట్లర్‌ కశ్యప్‌ మండిపడ్డాడు. ప్రస్తుతం ఐఓసీ వ్యవహారం చూస్తుంటే నవ్వులాటలా కనిపిస్తోందంటూ వ్యంగ్యాస్త్రం విసిరాడు.


జోక్‌ చేస్తోందా?

‘కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే దేశంలో అన్ని క్రీడా శిక్షణ కేంద్రాలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అథ్లెట్లు శిక్షణను కొనసాగించాలంటూ ఐఓసీ సూచిస్తోంది.. ఎలా? ఎక్కడ? శిక్షణ చేపట్టాలి.. ఐఓసీ జోక్‌ చేస్తోందా’ అని ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-03-20T13:34:20+05:30 IST