Abn logo
Aug 10 2020 @ 16:59PM

లాక్‌డౌన్‌లో ఆశ నెరవేర్చుకున్న పార్వతి

తమిళంలో ‘పూ’, ‘మరియాన్‌’, ‘చెన్నయిల్‌ ఒరునాళ్‌’ ‘బెంగళూరు నాట్కల్‌’ చిత్రాల్లో నటించిన అందాల నటి పార్వతి మలయాళంలోనూ నటించి అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. పార్వతి కొద్ది నెలల క్రితం ముక్కుపుడక వేసుకోవాలని ఆశపడ్డారు. సినిమాల్లో బిజీగా నటిస్తుండటంతో ముక్కు కుట్టించుకోలేకపోయారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంటిపట్టునే ఉన్న పార్వతి తన ఆశ నెరవేర్చుకున్నారు. ఇంటికే స్వర్ణకారుడిని పిలిపించి ముక్కు కుట్టించుకుని అందమైన పుక్కుపుడక ధరించారు.  సోషల్‌ మీడియాలో ముక్కుపుడక ధరించిన తన ఫొటో పెట్టి ఆ సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement