నిశ్మబ్దం.. నిర్మానుష్యం

ABN , First Publish Date - 2020-04-04T11:49:58+05:30 IST

జిల్లాలో పాజిటవ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ఏలూరు రూరల్‌ మండలంలోని తంగెళ్ళమూడి, వైఎస్‌ఆర్‌ కాలనీలో జనసంచార నియంత్రణపై ఏలూరు నగరంతో పాటు గ్రామాల్లో యంత్రాంగం మరింత దృష్టి సారించింది.

నిశ్మబ్దం.. నిర్మానుష్యం

 పాజిటివ్‌ కేసుల ప్రాంతాలలో మరింత కట్టుదిట్టం

అక్కడకు వెళ్లే అన్ని దారులూ బంద్‌

చుట్టుపక్క  గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది సర్వే

అవసరమైతే పరీక్షలకు ఏలూరు తరలింపు


ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 3 :  జిల్లాలో పాజిటవ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ఏలూరు రూరల్‌ మండలంలోని తంగెళ్ళమూడి, వైఎస్‌ఆర్‌ కాలనీలో  జనసంచార నియంత్రణపై ఏలూరు నగరంతో పాటు గ్రామాల్లో యంత్రాంగం మరింత దృష్టి సారించింది. లాక్‌డౌన్‌  మరింత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం ఎక్కడికక్కడ పటిష్టచర్యలు తీసుకున్నారు. కూరగాయలు, పాలు, పండ్లు, నిత్యావసరాలు ఇతరత్రా కొనుగోలుకు కేవలం మూడు గంటలకే పరిమితం చేశారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ మాత్రమే అనుమతించి తరువాత మొత్తం కట్టడి చేశారు.


ఉదయం 9 గంటల తరువాత ప్రధాన రహదారులు నిర్మానుష్యం అయ్యాయయి. తంగెళ్ళమూడి, వైఎస్‌ఆర్‌ కాలనీలో రెడ్‌జోన్‌ ఏర్పాటు చేయడంతో అటునుంచి ఇటు ఇటు నుంచి అటు రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. దీంతో రెడ్‌జోన్‌ ప్రాంతంలో పాలు, కూరగాయలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోపలికి వెళ్లడానికి పోలీసులు ఎవరినీ అనుమతించకపోవడంతో అత్యవసర మందులకోసం సైతం బయటకు పంపడం లేదని పలువురు  ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా రెడ్‌జోన్‌ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసరాలు పంపిణీలో విఫలమయ్యారు. 

Updated Date - 2020-04-04T11:49:58+05:30 IST