Abn logo
Nov 28 2020 @ 00:13AM

పాస్‌పుస్తకంలో ఇంగ్లీష్‌లో రైతు వివరాలు

  • భూమి విక్రయించేందుకు స్లాట్‌ బుకింగ్‌ కాక రైతు అవస్థలు
  • కూతురు పెళ్లి కోసం అప్పులు
  • అప్పులు కట్టలేక.. భూమి అమ్మలేక విలపిస్తున్న రైతు


మర్పల్లి:  తనకున్న కాస్త భూమిలో కొద్దిగా అమ్మి కూతురు పెళ్లి కోసం చేసిన అప్పును తీర్చుకుందామని ఓ రైతు భూమిని అమ్మేందుకు సిద్దమయ్యాడు. అయితే ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా పట్టాపా్‌సపుస్తకంలో రైతు పేరు ఇంగ్లీ్‌షలో నమోదైంది. దీంతో స్లాట్‌ బుక్‌ కాక తన భూమని విక్రయించలేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతు కంటతడి పెడుతున్నాడు. మండల పరిధిలోని కొత్లాపురం గ్రామానికి చెందిన వీర్లపల్లి నర్సింహులు అదే గ్రామంలో సర్వేనంబర్‌ 35/22లో ఎకరా 15 గుంటలు, 35/22/1 లో మరో ఎకరా పట్టా భూమి ఉంది. తన భూమిని విక్రయించి కూతురు వివాహం చేద్దామనుకుంటే సరైన ధర రాక రూ.4లక్షలు అప్పు చేసి కూతురు వివాహం చేశాడు. గత నెల రోజుల క్రితం తన భూమిని కొనేందుకు కొనుగోలు దారులు రావడంతో సంతోషించిన రైతు అప్పులు కట్టి ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉందామనుకున్నాడు.  తన పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకుని మర్పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌చేసుకునుందుకు స్లాట్‌ బుకింగ్‌కు వెళ్లాడు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ కాకపోవడంతో సాంకేతిక లోపమేమోనని భావించిన రైతు వారం రోజుల పాటు మీసేవా చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. తనకు స్లాట్‌ బుక్‌ కావడం లేదని రెవెన్యూ అధికారులను సంప్రదించగా పట్టా పాస్‌పుస్తకంలో ఇంగ్లీ్‌షలో పేరు నమోదు అయిందని, అందుకే స్లాట్‌ బుక్‌ కావడంలేదని చెప్పారు. దీంతో తన పేరు మార్చి తెలుగులో వచ్చే విధంగా చేయాలని అధికారులను కోరగా అలా చేయడం తమ పరిధిలో లేదని సమాధానం రావడంతో తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఒక వైపు కూతురు పెండ్లికి చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఉన్న  సొంత భూమిని అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఆ రైతు కంటతడి పెడుతూ విలపించాడు.

Advertisement
Advertisement