రైలు ప్రయాణికులూ.. రిజర్వేషన్ చేయించుకుంటున్నారా..? అయితే తప్పక తెలుసుకోవాల్సిన ‘కేసు’ ఇది..!

ABN , First Publish Date - 2021-10-15T12:21:39+05:30 IST

మధ్య తరగతి కుటుంబాలు దూర ప్రయాణం చేయాలంటే రైలు మార్గమే శరణ్యం. కానీ ట్రైన్‌లో సీటు దొరకుతుందో? లేదో? అనుమానమే. అందుకోసం రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం మంచిది. కానీ రిజర్వేషన్ చేసుకున్నా తనకు ప్రయాణంలో సీటు ఇవ్వలేదని...

రైలు ప్రయాణికులూ.. రిజర్వేషన్ చేయించుకుంటున్నారా..? అయితే తప్పక తెలుసుకోవాల్సిన ‘కేసు’ ఇది..!

మధ్య తరగతి కుటుంబాలు దూర ప్రయాణం చేయాలంటే రైలు మార్గమే శరణ్యం. కానీ ట్రైన్‌లో సీటు దొరకుతుందో? లేదో? అనుమానమే, దూర ప్రయాణంలో సీటు దొరక్కపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలుసు . అందుకోసం రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం మంచిది. కానీ రిజర్వేషన్ చేసుకున్నా తనకు ప్రయాణంలో సీటు ఇవ్వలేదని, తన ప్రయాణం చాలా కష్టంగా సాగిందని కోర్టుకెక్కాడు ఒక ప్రయాణికుడు. అతని కేసు విన్న జిల్లా వినియోగదారుల కోర్టు రైల్వే యజమాన్యానికి 20 వేలు జరిమానా విధించింది. అది ఎలాగంటే..


2018లో బీహార్లోని రాంచీలో నివసించే మనోజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జబల్‌పూర్ కట్నీ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని బలియాకు వెళ్లడానికి బయలుదేరాడు. అతనికి రిజర్వేషన్‌లో S-5 బోగీలోని సీటు నెంబర్ 65, 69 ఖరారైంది. కానీ ప్రయాణం కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లిన మనోజ్ కుమార్‌కు ఎంత వెతికినా S-5 బోగీ కనబడలేదు. 


అలా వెతుకుతున్న అతనికి రైలు కదలడంతో భార్యను తీసుకొని ఏదో ఒక బోగీలో ఎక్కాడు. అందులో టీసీ(టికెట్ చెకర్) కనబడటంతో.. మనోజ్ కుమార్ తన రిజర్వేషన్ టికెట్ టీసీకి చూపించి తన సమస్యను వివరించాడు. అప్పుడు ఆ టీసీ మనోజ్‌కు అసలు S-5 బోగీ ఈసారి పెట్టలేదని వారు కాసేపు వేచి ఉంటే వేరే సీటు ఇస్తానని చెప్పాడు. అలా ప్రయాణంలో ఎక్కడ కూర్చోవాలో తెలియక తన భార్యతో వేర్వేరు బోగీలలో తిరిగాక.. ఆ టీసీ వారిని పిలిచి S-2లో ఒక సీటు, S-4లో ఒక సీటు ఇచ్చాడు. అలా తన భార్యతో కలిసి ప్రయాణం చేయలేక మనోజ్ కుమార్ చాలా ఇబ్బంది పడ్డాడు. 


అసలు రైల్వే వారు తనకు ముందుగా S-5 బోగీ తొలిగిస్తిన్నట్లుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదు? రైల్వే యజమాన్యం చేసిన తప్పు వల్ల తనకు ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని మనోజ్ కోర్టు కెక్కాడు. అక్కడ తనకు ఎదురైన ఇబ్బందులను వివరించి న్యాయం చేయమని అడిగాడు. రైల్వే తరపున న్యాయవాది మాట్లాడుతూ.. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికీ వస్తుంటాయని, ఆ రోజు సాంకేతిక సమస్య వల్ల S-5 బోగీ తొలిగించాల్సి వచ్చిందని.. అయినా మనోజ్‌కి వేరే సీటు ఇచ్చామని వాదించాడు.


ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. S-5 బోగీ తొలగిస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం రైల్వే యజమాన్యం తప్పిదమని, దాని వల్ల మనోజ్ కుమార్ అనే ప్రయాణికుడికి కలిగిన ఇబ్బందికి గాను రూ.20 వేలు నష్టపరిహారం, కోర్టు ఖర్చులకు గాను మరో రూ.2 వేలు ఇవ్వాలని ఆదేశించింది.


Updated Date - 2021-10-15T12:21:39+05:30 IST