Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రవాస భారతీయులకు ఆధార్‌ బదులుగా పాస్‌పోర్టు నంబర్‌

వ్యాక్సినేషన్‌ సమయంలో నమోదు చేయించాలి..

ప్రవాసులకు ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో వెంకట్‌ సూచన

అమరావతి: ప్రవాస భారతీయులు వ్యాక్సినేషన్‌ సమయంలో ఆధార్‌ కార్డు బదులు పాస్‌ పోర్టు నంబరు నమోదు చేయించాలని ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో వెంకట్‌ ఎస్‌.మేడపాటి సూచించారు. విదేశాల నుంచి వచ్చి కొవిడ్‌తో ఇక్కడే ఉన్నవారు, విదేశాల్లో కొత్తగా ఉద్యోగ ఆఫర్‌ లెటర్స్‌ వచ్చినవాళ్లు, విద్యార్థులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌లో పాస్‌ పోర్టు నంబరు నమోదు చేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఆధార్‌ నంబరు నమోదు చేయించుకున్నవారికి పాస్‌ పోర్టు నంబరుతో వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ  సాయం కోసం 0863 2340678, 8500027678కు ఫోన్‌ చేయవచ్చన్నారు. 

TAGS: NRI
Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement