యూఏఈలో తిరిగి ప్రారంభ‌మైన పాస్‌పోర్ట్ సేవ‌లు...

ABN , First Publish Date - 2020-05-28T16:26:38+05:30 IST

క‌రోనా వైర‌స్ సంక్షోభం నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించ‌డంతో యూఏఈలో పూర్తిగా నిలిచిపోయిన పాస్‌పోర్ట్ సేవ‌లు బుధ‌వారం నుంచి తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి.

యూఏఈలో తిరిగి ప్రారంభ‌మైన పాస్‌పోర్ట్ సేవ‌లు...

యూఏఈ: క‌రోనా వైర‌స్ సంక్షోభం నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించ‌డంతో యూఏఈలో పూర్తిగా నిలిచిపోయిన పాస్‌పోర్ట్ సేవ‌లు బుధ‌వారం నుంచి తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో పాస్‌పోర్ట్ ఆఫీసులు తిరిగి తెరుచుకున్నాయని ఇండియ‌న్ కాన్సులేట్ కార్యాల‌యం వెల్ల‌డించింది. బుధ‌వారం ఉద‌యం నుంచే కార్యాక‌లాపాలు కూడా మొద‌ల‌య్యాయ‌ని కాన్సులేట్ అధికారులు తెలిపారు.


అయితే, ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభం వేళ పాస్‌పోర్ట్ ఆఫీసుల‌కు వ‌చ్చే వారు త‌ప్ప‌ని స‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. సామాజిక దూరం పాటించ‌డం, ముఖానికి మాస్కులు ధ‌రించ‌డం, చేతుల‌కు గ్లౌజులు వేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని అధికారులు స్ప‌ష్టం చేశారు. దేశంలోని అన్నీ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ ఆఫీసులు ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌ని చేస్తాయి. ఒక్క అల్ ఖ‌లీజ్ సెంట‌ర్‌లో మాత్రం ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ప‌ని చేస్తాయి.         

Updated Date - 2020-05-28T16:26:38+05:30 IST