ఉమ్మడి జిల్లాలో పాస్‌పోర్టుల ప్రకంపనలు!

ABN , First Publish Date - 2021-02-24T04:30:45+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పోలీసుశాఖలో బోధన్‌ పాస్‌పోర్టుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోహింగ్యాలకు బోధన్‌ నుంచి పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో బాధ్యులైన ఇద్దరి అధికారులను సస్పెండ్‌ చేయడంతో ఇత ర అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఉమ్మడి జిల్లాలో పాస్‌పోర్టుల ప్రకంపనలు!

బోధన్‌ పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో అధికారుల నష్టనివారణ చర్యలు  

ఎస్‌బీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సిబ్బంది తీరుపై సమీక్ష

త్వరలో బదిలీచేసే అవకాశం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పోలీసుశాఖలో బోధన్‌ పాస్‌పోర్టుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోహింగ్యాలకు బోధన్‌ నుంచి పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో బాధ్యులైన ఇద్దరి అధికారులను సస్పెండ్‌ చేయడంతో ఇత ర అధికారులు ఉలిక్కిపడ్డారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేయడం వల్లనే ఈ వ్యవహారం జరిగినట్లు గుర్తించిన అఽధి కారులు వారిపై వేటు వేశారు. ఇతర అధికారులను కూడా బదిలీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాస్‌పోర్టుల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పాస్‌పోర్టుల వి చారణ చేస్తున్న కానిస్టేబుళ్లు, ఏఎస్సైలతో సమావేశాలు ని ర్వహిస్తున్నారు. అన్ని అంశాలను కట్టుదిట్టంగా పరిశీలించి న తర్వాతనే నివేదికలు ఇవ్వాలని కోరుతున్నారు. 

ఉన్నతాధికారుల మెడకూ వ్యవహారం

బోధన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారం ఉన్నతాధికారుల మెడకు కూడా చుట్టుకుంటోంది. గత కొ న్నేళ్లుగా పాస్‌పోర్టుల జారీలో పనిచేస్తున్న ఎస్‌బీ సిబ్బంది ని బదిలీ చేయకపోవడం వల్ల ఈ వ్యవహారం జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండడం తో జిల్లా అధికారులు కూడా ఈ వ్యవహారంపై దృష్టిపెటా రు. ఇంకా ఏమైనా జారీ అయ్యాయా? అని లోతుగా దర్యా ప్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతీ సర్కిల్‌ స్టేష న్‌ పరిధిలో పాస్‌పోర్టుల జారీ కోసం ఒక కానిస్టేబుల్‌ ఉ న్నారు. వీరే ఎస్‌బీకి కీలక విషయాలపైన సమాచారం ఇ వ్వడంతో పాటు పాస్‌పోర్టులు జారీ కోసం విచారణ చేస్తా రు. వీరి నివేదిక ఆధారంగానే పాస్‌పోర్టులు జారీ అవుతా యి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కువ మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ పాస్‌పోర్టే కీలకం. వీరు ఇచ్చే నివేదిక కీలకం కావడంతో కొన్ని డబ్బులు ఇచ్చి కూడా మేనేజ్‌ చేస్తున్నారు. పాస్‌పోర్టులు పొంది ఇతర దే శాలకు వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆర్మూర్‌, నిజామాబా ద్‌, కామారెడ్డి, బోధన్‌ డివిజన్‌ పరిధి నుంచి ఎక్కువ మం ది విదేశాలకు వెళ్లారు. బాన్సువాడ డివిజన్‌ నుంచి కొద్ది మంది మాత్రమే గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. బోధన్‌లో రోహింగ్యాలకు భారీగా డబ్బులు తీసుకొనే 70 వరకు పాస్‌పోర్టులు జారీ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం వారంతా ఎక్కడ ఉన్నారో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఎస్‌బీలో ఏళ్ల తరబడి ఒకే స్థానంలో..

ఉమ్మడి జిల్లా పరిధిలో ఎస్‌బీ విభాగం కీలకమైనది. పో లీసు శాఖలో కీలకమైన సమాచారం వీరి ద్వారానే జిల్లా ఉ న్నతాధికారులకు అందుతుంది. వీరందించే సమాచారం ద్వారానే ఎస్పీలు, కమిషనర్‌లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగే విషయాలను తెలుసుకుంటారు. ఎస్‌బీలో పనిచేసేందుకు డిప్యూటేషన్‌లపై కా నిస్టేబుల్‌లను తీసుకుంటారు. రెండు లేదా మూడేళ్ల తర్వా త వారిని బదిలీ చేస్తారు. మళ్లీ కొత్త వారిని తీసుకుంటారు. కానిస్టేబల్‌ నుంచి ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వరకు ఇదే విధానం కొనసాగుతుంది. కొత్తగా వచ్చే కమిషనర్‌లుగానీ, ఎస్పీలుగానీ తమకు నమ్మకం ఉండేవారిని ఎంపిక చేసుకుని స మాచారం తెప్పించుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ శాఖలో పనిచేస్తున్న వారు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉ న్నారు. పదోన్నతులు వచ్చినా బదిలీ చేయలేదు. ఏళ్ల తరబడి ఒకేచోట కొనసాగిస్తున్నారు. కొంతమంది ఏసీబీ అధి కారులకు పట్టుబడినా కొన్ని రోజులు సస్పెండ్‌ చేసి తర్వా త ఇదే వింగ్‌లోకి తీసుకున్నారు. వారిని కొనసాగిస్తున్నారు. పదోన్నతులు వచ్చిన తర్వాతగానీ, మూడేళ్లు పూర్తయిన త ర్వాత వారిని పేరెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలి. ఇది చేయకపోవడం వల్ల పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో వా రు పాతుకుపోయారు. కొంతమందిని ఆయా మండలాల పరిధిలో మీడియేటర్‌గా పెట్టుకుని మామూళ్లు తీసుకుం టూ ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఎంక్వైరీ రిపోర్టు లు ఇస్తున్నారు. ఈ ఎంక్వైరీ రిపోర్టులు ప్రతీవారం ఉన్నతాధికారులు సమీక్షించాలి. ఎస్‌బీలో పనిచేస్తున్న వారితో మా ట్లాడి కీలకంగా పనిచేసేవిధంగా చూడాలి. గత కొన్నేళ్లుగా చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల బోధన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఏమైనా ఇలాంటివి జారీ అ య్యాయా అని పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎస్‌బీలో పనిచేసేవారితో సమీక్షిస్తూ వారు ఇచ్చే పాస్‌పోర్టుల నివేదికను ప్రతీవారం పరిశీలించాలని నిర్ణయించారు.

అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే..

ఉమ్మడి జిల్లాలోని పలు సర్కిళ్ల పరిధిలో అధికారుల ప ర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా వీరు సమాంతరంగా ప నిచేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. బోధ న్‌ వ్యవహారంలో విమర్శలు వస్తుండడంతో పోలీస్‌స్టేషన్‌ల వారీగా చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు సస్పెండ్‌ కావడంతో ఇంకా ఇతర సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణంలో విచార ణ చేస్తున్నారు. సైబరాబాద్‌ అధికారులతో పాటు నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసు కున్న అధికారులు మరికొంత మందిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచి మీ-సేవ ద్వారా వచ్చే ద రఖాస్తులను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణ యం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర ఉన్న తాధికారులు సీరియస్‌ కావడంతో జిల్లా అధికారులు ఎవ రూ స్పందించడంలేదు. బోధన్‌ పాస్‌పోర్టుల జారీ వ్యవహా రం మాదిరిగానే ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే ఇటువంటి తప్పిదాలు తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పనిచేస్తున్నవారు, ఆరోపణలు ఎదుర్కొంటు న్న సిబ్బందిని బదిలీ చేస్తేనే రోహింగ్యాల లాంటివారితో పాటు సంఘవిధ్రోహశక్తులకు పాస్‌పోర్టులు అందకుండా ఉండే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు తీసుకునే చర్యల ఆధారంగానే సిబ్బంది బదిలీ ఉండే అవకాశం ఉంది. పై స్థాయిలో అండదండలు ఉండడం వల్లనే వీరు కొనసాగుతున్నట్లు పోలీసుశాఖలోని కొంతమంది అధికారులు భావిస్తున్నారు. శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని కొత్తవారిని నియమిస్తే సజావుగా సాగే అవకాశం ఉంది. 

Updated Date - 2021-02-24T04:30:45+05:30 IST