Abn logo
Jan 17 2021 @ 16:38PM

టార్గెట్ చంద్రబాబు.. పాస్టర్ తీవ్ర వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో బలవంతపు మతమార్పిడీలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాటలను కొంతమంది పాస్టర్లు వక్రీకరిస్తూ.. తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగు దేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పాస్టర్ల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. బెల్లంపల్లిలో ఓ పాస్టర్ మాట్లాడుతూ.. ‘‘క్రిస్టియన్ల గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడారు. చులకన చేస్తూ మాట్లాడుతున్నారు. నువ్వు ఏం చేస్తావు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరున్న ప్రాంతాల్లో నాయకులను కాలర్ పట్టుకుని ప్రశ్నించాలంటూ క్రైస్తవులను రెచ్చగొట్టేలా పాస్టర్ మాట్లాడాడు. ‘రోజు రోజూ కాదు గంట గంటకు మతమార్పిడీలు చేస్తాం’ అంటూ సవాల్ విసిరాడు. 


ఇదిలా ఉంటే, పాస్టర్ల ప్రచారాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు. పాస్టర్ల ప్రచారం వెనక వైసీపీ ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టియన్లను టీడీపీకి దూరం చేసే కుట్ర కనపడుతోందంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement